సముద్ర తీరంలో వింత జీవులు..
వేల్స్ తీరంలో పోర్చుగీస్ మ్యాన్ ఓ' వార్ జీవులు పెద్ద సంఖ్యలో కొట్టుకువచ్చాయి. ఇవి జెల్లీఫిష్ కానప్పటికీ, అత్యంత విషపూరితమైనవి. వీటిని తాకితే తీవ్రమైన నొప్పి, అలర్జీలు వచ్చే ప్రమాదముంది, ప్రాణాంతకం కూడా కావచ్చు. కోస్ట్‌గార్డ్ అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. తాకవద్దని, ఒడ్డున ఉన్నా విషం ఉంటుందని హెచ్చరించారు. కరిచినప్పుడు వెంటనే వైద్య సహాయం తీసుకోవాలని సూచించారు.
యునైటెడ్ కింగ్‌డమ్‌లోని వేల్స్ తీరంలో వింతజీవులు కలకలం సృష్టించాయి. అత్యంత ప్రమాదకరమైన సముద్ర జీవులు అయిన “పోర్చుగీస్ మ్యాన్ ఓ’ వార్” అనే ఈ జీవులు పెద్ద సంఖ్యలో ఒడ్డుకు కొట్టుకువచ్చాయి. ఫ్లోటింగ్ టెర్రర్స్‌గా పిలిచే ఈ జీవులు అబెరావాన్ బీచ్‌తో పాటు పెంబ్రోక్‌షైర్, గ్వినెడ్, ఆంగ్లెసీ తీర ప్రాంతాల్లో కనిపించడంతో స్థానిక కోస్ట్‌గార్డ్ అధికారులు ప్రజలకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. వీటిని పొరపాటున కూడా తాకవద్దని, అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అధికారుల చెప్పినదానిని బట్టి చూస్తే.. చూడటానికి జెల్లీఫిష్‌లా కనిపించినప్పటికీ, పోర్చుగీస్ మ్యాన్ ఓ’ వార్ అత్యంత విషపూరితమైనది. దీని టెంటకిల్స్ చర్మానికి తగిలితే తీవ్రమైన నొప్పి, దద్దుర్లు, బొబ్బలు ఏర్పడతాయి. కొన్ని సందర్భాల్లో జ్వరం, షాక్, శ్వాస సంబంధిత సమస్యలు కూడా తలెత్తవచ్చు. ఒక్కోసారి ప్రాణాంతకమైన అలర్జిక్ రియాక్షన్లకు దారితీసే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆశ్చర్యకరంగా, ఈ జీవి చనిపోయిన తర్వాత కూడా దాని టెంటకిల్స్‌లో విషం ఉంటుంది. అందుకే ఒడ్డున పడి ఉన్న వాటిని కూడా ముట్టుకోకూడదని స్పష్టం చేశారు. వైల్డ్‌లైఫ్ ట్రస్ట్స్ ఏం చెప్పాయంటే.. పోర్చుగీస్ మ్యాన్ ఓ’ వార్ వాస్తవానికి జెల్లీఫిష్ కాదు. ఇది ఒక సైఫనోఫోర్, అంటే అనేక చిన్న జీవులు ఒక సమూహంగా ఏర్పడి జీవించే ఒక విలక్షణమైన జీవి. దీనికి పారదర్శకమైన ఊదా రంగు బుడగ లాంటి శరీరం, గులాబీ రంగు శిఖరం, పొడవైన నీలిరంగు టెంటకిల్స్ ఉంటాయి. సాధారణంగా సముద్ర ఉపరితలంపై తేలియాడే ఈ జీవులు.. బలమైన గాలులు, తుపానుల కారణంగా ఒడ్డుకు కొట్టుకొస్తుంటాయి. దీని విషం చిన్న సముద్ర జీవులను పక్షవాతానికి గురి చేసి చంపుతుంది. ఇది ఎవరినైనా కాటు వేసిందంటే.. భరించలేరు. ఒకవేళ ఎవరైనా దీని బారిన పడితే, వెంటనే అది తాకిన భాగాన్ని సముద్రపు నీటితో శుభ్రం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. చర్మానికి అంటుకున్న టెంటకిల్స్‌ను చేతితో కాకుండా, ఏదైనా కార్డ్ వంటి వస్తువుతో జాగ్రత్తగా తొలగించాలి. ఆ తర్వాత ఆ భాగాన్ని వేడి నీటిలో ఉంచి, తక్షణమే వైద్య సహాయం తీసుకోవాలి. ప్రమాదకరమైన ఈ జీవులను బీచ్ నుంచి తొలగించే పనిని చేపట్టారు కోస్ట్‌గార్డ్ సిబ్బంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Health: శీతాకాలంలో తినాల్సిన కూరగాయలు ఇవే
స్కూలుకి వెళ్లనని చిన్నారి మారాం.. పేరెంట్స్ ఏం చేశారో చూడండి
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..

