Bengaluru: రెండ్రోజులుగా బెంగళూరుపై చక్కర్లు కొడుతున్న భారీ విమానం.! ఎందుకంటే.?

|

Apr 06, 2024 | 8:52 PM

గత రెండ్రోజులుగా బెంగళూరు నగరంపై అతి తక్కువ ఎత్తులో ఓ భారీ విమానం చక్కర్లు కొడుతుండడం నగరవాసుల్లో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా, కోరమంగళ ప్రాంతంలోని గగనతలంలో ఈ విమానం దర్శనమిస్తోంది. అసలే భారీ విమానం.. దానికి తోడు చాలా తక్కువ ఎత్తులో ప్రయాణిస్తుండడంతో అందరి దృష్టిలో పడింది. ఈ భారీ విమానం తక్కువ ఎత్తులోకి వస్తోంది కానీ ల్యాండ్ కాకుండానే వెళ్లిపోతోందని స్థానికులు చర్చించుకుంటున్నారు.

గత రెండ్రోజులుగా బెంగళూరు నగరంపై అతి తక్కువ ఎత్తులో ఓ భారీ విమానం చక్కర్లు కొడుతుండడం నగరవాసుల్లో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా, కోరమంగళ ప్రాంతంలోని గగనతలంలో ఈ విమానం దర్శనమిస్తోంది. అసలే భారీ విమానం… దానికి తోడు చాలా తక్కువ ఎత్తులో ప్రయాణిస్తుండడంతో అందరి దృష్టిలో పడింది. ఈ భారీ విమానం తక్కువ ఎత్తులోకి వస్తోంది కానీ ల్యాండ్ కాకుండానే వెళ్లిపోతోందని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఈ విమానం ప్రతి రోజు ఇక్కడి హెచ్‌ఏఎల్‌ ఎయిర్ పోర్టుపై ఆరుసార్లు చక్కర్లు కొట్టి వెళ్లిపోతున్నట్టు స్థానికులు గుర్తించారు. బెంగళూరు వాసులు దీనికి సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. అయితే, ఈ విమానం సంగతి ఏంటనేది ఫ్లైట్ రాడార్24 అనే వెబ్ సైట్ వెల్లడించింది. ఇది భారత రాష్ట్రపతి, ప్రధాని ఉపయోగించే ప్రత్యేక విమానం అని, ఇది బోయింగ్ 777 రకానికి చెందిన విమానం అని తెలిపింది. కేంద్ర ప్రభుత్వం వద్ద ఇలాంటి ప్రత్యేక విమానాలు రెండు ఉన్నాయని వెల్లడించింది. దేశంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో ప్రభుత్వ పెద్దలు ఈ విమానాలను మరో రెండు నెలల పాటు ఉపయోగించే అవసరం ఉండదు. అందువల్ల వీటి ఇంజిన్లను కండిషన్లో ఉంచేందుకు ఇలా బెంగళూరు వరకు తీసుకువస్తున్నారని, ఈ ప్రత్యేక విమానాలను నడపడంలో పైలెట్లకు తగిన శిక్షణ ఇచ్చేందుకు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారని తెలిపింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.

ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.

‘నా భర్త VDలా ఉండాలి.!’ నో కన్ఫూజన్‌ తెలిసిన కాంబినేషనేగా..