Black snow covers streets of Omsukchan village Know Shocking Reasons: చల్లని శీతల గాలులు, తెల్లని మంచు తుంపరలు హేమంత ఋతువు (Winter Season)లో చలి కొంత కష్టాన్ని కలిగించినా, ఇష్టమైన కష్టంగా బలే ఉంటుంది కదా! నిజానికి.. అదో రకమైన థ్రిల్ ఇస్తుంది. ఐతే ఒక్క సారి ఊహించండి.. మంచు తెల్లగా కాకుండా పూర్తి నల్లగా ఉంటే.. ఉదయం నిద్రలేచేసరికి ఊరంతా నల్లగా మంచు (Black snow) పేరుకుపోయి ఉంటే.. మీకేమనిపిస్తుంది? చిర్రెత్తుకొస్తుందని తెలుసులే..! ఊహకే కంపరం పుడుతోంది.. అటువంటిది పాపం.. ఈ దేశంలో నల్లని మంచు రోజూ కొన్ని అడుగుల మందంతో కురుస్తోంది మరి. కారణం తెలియక జుట్టు పీక్కున్నంత పనిచేస్తున్నారు. ఆ విశేషాలు ఏమిటో తెలుసుకుందామా..
ఈ వింత సంఘటన రష్యాలో చోటుచేసుకుంది. నిజానికి అక్కడ ఓ మారుమూల ప్రాంతంలో కాలుష్యం కారణంగా నల్లని మంచు కురుస్తోందట. అందువల్లనే తెల్లటి మంచు పడటానికి బదులుగా, నల్లని మంచు పడుతోంది. ఈ దేశానికి చెందిన సైబీరియాలోని మగడాన్ ప్రాంతంలోని ఓంసుచన్‌లో నల్లని మంచు కురుస్తోంది. బూడిద, నల్లటి మంచుతో కప్పబడిన వీధుల్లోతమ పిల్లలు ఆటలాడుకోవల్సి వస్తుందని అక్కడి స్థానికులు వాపోతున్నారు. నిజానికి.. బొగ్గుతో పనిచేసే వేడి నీటి ప్లాంట్ (coal-fired hot water plant) ఈ ప్రాంతంలో ఉంది. ఈ ప్లాంట్ ఆ ప్రాంతంలోని నాలుగు వేల మందికి అవసరమైన వేడిని అందిస్తుంది. దీంతో మసి, దుమ్ము వల్ల కాలుష్యం కూడా బాగా పెరిగింది. ప్రస్తుతం ఇక్కడ కురుస్తున్న నల్లని మంచుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. 21వ శతాబ్దంలో మనం ఏ విధంగా జీవిస్తున్నామనేది దీనిని బట్టి తెలుస్తోందని, 2019లో కూడా ఈ విధంగానే నల్లని మంచు కురిసిందని అక్కడి స్థానికులు తెలిపారు. మరోవైపు మూడు దశాబ్ధాల క్రితం సోవియట్ యూనియన్ కుప్పకూలినప్పటినుంచి ఇక్కడి పరిస్థితిలో ఎటువంటి మార్పు జరగలేదని, ఇప్పటికీ మా పిల్లలు నల్లని పొగను పీల్చుతున్నారని, ఇక్కడి పరిస్థితులు ఏమీ మారలేదని కూడా స్థానికులకు అంటున్నారు.
ఈ నెల (జనవరి)లో రష్యా ఉష్ణోగ్రతలు 50 డిగ్రీల కంటే తక్కువకు చేరుకుందని, అందువల్ల బొగ్గును పెద్ద ఎత్తున కాల్చారని, అందుకే నల్లని మంచు కురుస్తోందని అధికారులు అంటున్నారు. నిజంగా బొగ్గును కాల్చడం వల్ల జరిగిందో.. మరెందుకు నల్లని మంచుకురుస్తుందో ఖచ్చితమైన కారణాలు మాత్రం తెలియరాలేదు.
#Russia is a country of outstanding natural beauty and diversity. But the sheer lack of environmental regulations is a devastating effect for residents in #Kuzbass, where last night there was BLACK SNOW. pic.twitter.com/zMiEWBJbnh
— Mikhail Khodorkovsky (English) (@mbk_center) February 14, 2019
Also Read: