షాకింగ్ వీడియో.. బస్సును ఓవర్ టెక్ చేయబోయి ప్రాణాలే వదిలాడు
రోడ్డు మీద ప్రయాణించే వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ చాలా జాగ్రత్తగా వెళ్లాలని, హెల్మెట్ తప్పక ధరించాలని, అతివేగం పనికిరాదని అధికారులు హెచ్చరిస్తూనే ఉంటారు. కానీ కొందరు ఈ సూచనలను ఖాతరు చెయ్యకుండా ఇష్టారాజ్యంగా వాహనాలు నడుపుతారు. ఇక కొందరు ఎంత జాగ్రత్తగా వెళ్లినా అవతలివారి కారణంగా ప్రమాదాల్లో పడుతుంటారు. తాజాగా ఓ బైకర్ బస్సును ఓవర్ టేక్ చేయబోయి ప్రాణాలే కోల్పోయాడు.
దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన గుజరాత్‌లోని సూరత్‌లో జరిగింది. గుజరాత్‌లోని సూరత్‌లో రోడ్డుపై వాహనాలు దూసుకెళ్తున్నాయి. అదే క్రమంలో బస్సును ఓవర్ టేక్ చేసేందుకు బైకర్ ప్రయత్నించాడు. అంతే బైక్ అదుపు తప్పి రోడ్డుపై జారిపడింది. బైక్‌పై వెళ్తున్న ఇద్దరూ కిందపడిపోయారు. బైక్ నడిపిన వ్యక్తి పైనుంచి బస్సు దూసుకెళ్లడంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే అతను మృతిచెందినట్టు వైద్యులు తెలిపారు. బైక్ వెనుక కూర్చున్న వ్యక్తికి గాయాలయ్యాయి. మరోవైపు అదుపుతప్పిన బైకును అదే రోడ్డులో రాంగ్ రూట్‌లో వస్తున్న మరో వ్యక్తి ఢీకొట్టి కిందపడ్డాడు. అతనికి కూడా స్వల్ప గాయాలయ్యాయి. ఇక ఈ దృశ్యాలు అక్కడి సీసీటీవీలో రికార్డయ్యాయి. ఈ ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బస్సు డ్రైవర్‌పై కేసు నమోదు చేశారు. రాంగ్ రూట్‌లో వచ్చిన బైకర్ గురించి కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. కాగా, ఈ ప్రమాదానికి సంబంధించిన షాకింగ్ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
మరిన్ని వీడియోల కోసం :
తెలివైన రాజు..వారసత్వంగా వచ్చిన ఆస్తులు.. తెలివిగా..
బ్రష్ చేస్తుండగా చిట్లిన రక్తనాళం.. వైద్య చరిత్రలో అరుదైన వ్యాధి
నీళ్లతో నడిచే రైలు.. భారత రైల్వే ప్రారంభం
