Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కొడుకును రక్షించబోయి... ప్రాణాలు కోల్పోయిన తండ్రి వీడియో

కొడుకును రక్షించబోయి… ప్రాణాలు కోల్పోయిన తండ్రి వీడియో

Samatha J

|

Updated on: Jun 05, 2025 | 3:55 PM

ఓ కుటుంబాన్ని చీకటి పూర్తిగా అంధకారంలోకి నెట్టేసింది. అది వారి తలరాత అనుకోవాలో లేక విధి ఆడిన విన్తనాటకమో ఓ కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. భోపాల్లోని రాయల్ ఫార్మా అపార్ట్‌మెంట్లో జరిగిన విషాదానికి చీకటే కారణంగా నిలిచింది. ఒకవైపు భారీ వర్షం ఎదురుగాలులతో కరెంటు పోతే అదే సమయంలో ఆ ఇంటి చిన్నారి లిఫ్ట్లో ఇరుక్కుపోయిన ఘటన తండ్రి ప్రాణాల మీదకు తెచ్చింది. మూడో ఫ్లోర్లో ఉంటున్న రిషిరాజ్ కుటుంబం ఇప్పుడు చీకటి తెచ్చిన విషాదాన్ని తలుచుకొని రోదిస్తున్న తీరు వర్ణనాతీతం.

అసలు ఏం జరిగిందంటే మే 26వ తేదీ రాత్రి 10 గంటలకు భారీ వర్షం కారణంగా పవర్ సప్లై నిలిచిపోయింది. ఆ సమయంలో రిషిరాజ్ తన ఎనిమిదేళ్ల కొడుకు దేవాంశ్ గురించి ఆరాతీశారు. అయితే ఆ పిల్లవాడు కిందకు వెళ్లాడని తల్లి చెప్పడంతో రిషిరాజ్ హుటాహుటిన దేవాంశ్ గురించి వెతకడం ప్రారంభించారు. అయితే ఆ సమయంలో జనరేటర్ పనిచేయకపోవడాన్ని గమనించారు. దేవాంశ్ దేవాంశ్ అంటూ ఆ ఫ్లోర్ నుంచే అరవడం ప్రారంభించారు. అయితే పప్పా పప్పా అంటూ చిన్నగా ఓ గొంతు వినిపించింది. లిఫ్ట్లో కుమారుడు ఇరుక్కుపోయాడని గ్రహించిన తండ్రి తన పిల్లవాడికి ధైర్యం చెబుతూ మెట్లు ఎక్కుతూ దిగుతూ జనరేటర్ ఉన్న ప్రాంతానికి పరుగుతీశారు. అంతే నిమిషాల వ్యవధిలో లిఫ్ట్ ఆన్ కావడం ఆ తండ్రి అక్కడే కుప్పకూలడం జరిగిపోయాయి. ఆ చీకటిలో రిషిరాజ్ గుండెపోటుతో కుప్పకూలిపోవడాన్ని ఎవరూ గమనించలేదు. కాస్త ఆలస్యంగా చూసి సిపిఆర్ చేసినా ఫలితం లేకుండా పోయింది.

మరిన్ని వీడియోల కోసం :

ఈసారి మరింత భయంకరంగా కరోనా? బాబా వంగా చెప్పినట్టే జరిగి తీరుతుందా? వీడియో

వామ్మో.. పాములతో కలిసి జీవిస్తున్న గ్రామస్తులు వీడియో

మిర్యాలగూడలో మిస్‌ 420..కూపీలాగితే ఖాకీలు సైతం షాకయ్యే క్రైమ్‌ వీడియో