దయగా ఉంటే చాలు దెయ్యాలను పూజించినా డోంట్ కేర్.. ఆకట్టుకుంటున్న టూలెట్‌ ప్రకటన

Updated on: Aug 13, 2025 | 6:50 PM

బెంగళూరులో అద్దె ఇల్లు దొరకడమే కష్టం. దొరికినా అడ్వాన్స్‌లు, రెంట్‌లు, కండిషన్లు భారీగా ఉంటాయి. అలాంటిది...బెంగళూరులో ఓ మహిళ పోస్ట్ చేసిన టూలెట్ ప్రకటన ప్రస్తుతం వైరల్ గా మారింది. సాధారణంగా ఇల్లు అద్దెకు ఇవ్వాలంటే సవాలక్ష కండీషన్లు పెట్టే యజమానులు ఇలాంటి ప్రకటన ఇవ్వడమేంటని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. సదరు అద్దె ప్రకటనలో కండీషన్లు చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే.

చక్కని మూడు పడక గదుల అపార్ట్ మెంట్ లో ఓ బెడ్ రూంను అద్దెకిస్తానంటూ యువతి ప్రకటించింది. మహిళలకు మాత్రమే అనే ముఖ్యమైన కండీషన్ తో పాటు ‘దయగా ఉంటే చాలు మీరు దెయ్యాలను పూజించినా పట్టించుకోనని ప్రకటనలో పేర్కొంది. మీరు పొగ తాగినా, మద్యం సేవించినా, మాంసాహారం తిన్నా తనకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపింది. పెంపుడు జంతువులంటే తనకు ప్రేమ అని, రెంట్‌కి వచ్చేవారు వారితో పాటు వారి పెట్ ను తీసుకొస్తే సంతోషిస్తానని తెలిపింది. అదేవిధంగా, ఈ అపార్ట్ మెంట్ తో తనకు విడదీయలేని అనుబంధం ఉందని, ఫ్లాట్ మేట్ లుగా వచ్చిన వారు మంచి స్నేహితులుగా మారారని చెప్పింది. ఈమేరకు ఓ యువతి ఎక్స్ లో ఈ యాడ్ ను పోస్ట్ చేసింది. పూర్తి ఫర్నీచర్ తో కూడిన బెడ్ రూం ఫొటోలతో వివరాలు వెల్లడించింది. ప్రస్తుతం ఈ యాడ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ టూలెట్ ప్రకటన చూసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్లు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అమ్మ బాబోయ్‌.. 4.5 km పొడవైన రైలును చూసారా?

విమర్శల ధాటికి వివరణ ఇచ్చుకున్న హీరోయిన్

బిగ్‌ బాస్‌లోకి పహల్గామ్ ఉగ్రదాడి బాధితురాలు

మహేష్ సినిమాలో.. రావు బహదూర్‌గా సత్యదేవ్‌

NTR కాదు.. విలన్‌గా వార్‌2లో సర్‌ప్రైజ్ స్టార్