దిష్టిబొమ్మగా పెద్ద కళ్ళ మహిళ !! ఇంతకీ ఎవరీమె ??

Updated on: Jan 09, 2026 | 9:21 PM

బెంగళూరులో నిర్మాణంలో ఉన్న భవనాలపై వింత ట్రెండ్ నడుస్తోంది. సాధారణ దిష్టిబొమ్మలకు బదులుగా, పెద్ద కళ్ళ మహిళ ఫోటోలు దర్శనమిస్తున్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ ఫోటోల వెనుక నిహారిక రావు అనే యూట్యూబర్ ఉందని, ఆమె మీమ్ ఇప్పుడు 'దిష్టి పరిహారం'గా మారిందని నెటిజన్లు కనుగొన్నారు. ఈ వినూత్న దిష్టిబొమ్మల వాడకం ఇప్పుడు అంతటా చర్చనీయాంశంగా మారింది.

నిర్మాణంలో ఉన్న బిల్డింగ్‌ల ముందు ‘దిష్టిబొమ్మలు’గా సాధారణంగా రాక్షసుల బొమ్మలు తగిలిస్తారు. బదులుగా ఓ పెద్ద కళ్ళ మహిళ ఫొటోను ఏర్పాటు చేస్తున్న ట్రెండ్ బెంగళూరులో ఈ మధ్య బాగా నడుస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ అయిన మహిళ ఫోటోను కొత్త బిల్డింగ్‌ల ముందు ఉంచుతున్నారు. అయితే ఎక్కడ చూసినా ఆ మహిళ ఫోటోలే వైరల్ కావడంతో.. అసలు ఆమె ఎవరు అనే ప్రశ్న అందరికీ వస్తోంది. దీంతో పెద్ద పెద్ద కళ్లతో ఉన్న ఆ మహిళ గురించి నెటిజన్లు సెర్చ్ చేయడం ప్రారంభించారు. బెంగళూరులో నిర్మాణంలో ఉన్న భవనాల పైన ఏర్పాటు చేస్తున్న దిష్టి బొమ్మలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. దిష్టిబొమ్మలు వైరల్ అవుతుండటం ఏంటి అని ఆలోచిస్తున్నారా. అవి సాధారణ దిష్టిబొమ్మలు కాదు.. ఒక మహిళ ఫోటోను దిష్టిబొమ్మల్లా వాడుతున్నారు. ఎక్కడ కొత్త బిల్డింగ్ కడుతున్నా ఇప్పుడు ఆ మహిళ ఫోటోనే దర్శనం ఇస్తుండటం ఆశ్చర్యకరంగా మారింది. ఇలాంటి ఫోటోలను కొందరు నెటిజన్లు.. సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇప్పుడు అది తెగ వైరల్ అవుతోంది. దీంతో ఇప్పుడు అంతా ఆ ఫోటో గురించే చర్చించుకుంటున్నారు. కర్ణాటకలో నివసించే ఒక మహిళ తాను ప్రయాణించేటప్పుడు కొత్త కొత్త భవనాలపై ఇలాంటి వింత పోస్టర్లను గమనించింది. అయితే ఆ ఫోటోలో ఉన్న మహిళ ఎవరు అనేది గూగుల్ లెన్స్ ద్వారా వెతికినా ఫలితం లేకపోవడంతో ఆమె ఎక్స్‌ వేదికగా ఈ ఫోటోను షేర్ చేసింది. ఆ ఫోటోలో ఉన్న మహిళ ఎవరు అంటూ ఆమె ప్రశ్నించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. సాధారణంగా ఇళ్ల నిర్మాణ సమయంలో దిష్టి తగలకుండా గుమ్మడికాయలు లేదా రాక్షసుల ముఖం ఉన్న బొమ్మలను కడతారు. అయితే ప్రజలు వినూత్నంగా ఆలోచిస్తూ ఈ మహిళ ఫోటోను నజర్ బట్టు లా ఉపయోగిస్తున్నారు. ఇంటర్నెట్‌లో నెటిజన్లు తెగ వెతికేసి.. ఆమె ఒక యూట్యూబర్ అని గుర్తించారు. ఆమె పేరు నిహారిక రావు అని.. ఆమె కర్ణాటకకు చెందిన యూట్యూబర్ అని తెలుసుకున్నారు. 2023 వీడియో క్లిప్ లో ఆమె ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్ బాగా వైరల్ అయింది. దీంతో ప్రస్తుతం ఈ బిగ్ ఐడ్ మిస్టరీ ఉమెన్ ఫోటోలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. ఆ మీమ్ కాస్తా ఇప్పుడు భవనాలపై దిష్టిబొమ్మగా స్థిరపడిపోయింది. రాక్షసుల బొమ్మల కంటే.. ఇలాంటి ఫన్నీ, వింతైన మీమ్ పోస్టర్లు ఇంటికి దిష్టి తగలకుండా.. జనాల చూపును పక్కదారి పట్టించడానికి బాగా పనిచేస్తాయని స్థానికులు భావిస్తున్నారు. అందుకే బెంగళూరులో ఈ పోస్టర్లు దర్శనమిస్తున్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఛీ.. వీడు మనిషేనా ?? తల్లికి అనారోగ్యంగా ఉందని సెలవు అడిగితే

LIC పాలసీ ప్రీమియం కట్టలేకపోతున్నారా ?? ఇది మీకోసమే

రూ.4 చోరీ కేసులో.. 51 ఏళ్లకు తీర్పు

33 రోజుల్లో రికార్డ్స్ అవుట్.. అన్నీ అతడి హస్తగతం

Samantha: పెద్ద ప్లాన్ చేస్తున్న సమంత.. వర్కవుట్ అయితే రచ్చే