Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

2 గంటల్లోనే హైదరాబాద్ నుంచి బెంగళూరుకు..! వీడియో

2 గంటల్లోనే హైదరాబాద్ నుంచి బెంగళూరుకు..! వీడియో

Samatha J

|

Updated on: Feb 10, 2025 | 12:24 AM

హైదరాబాద్ వాసులు బుల్లెట్ రైలు ఎక్కే రోజులు ఎంతో దూరంలో లేవు. దేశంలోని ప్రధాన నగరాలను బుల్లెట్ రైలుతో అనుసంధానించే భారీ ప్రాజెక్టులో మరో కీలక అడుగు పడింది. హైదరాబాద్-ముంబై మధ్య 709 కిలోమీటర్ల మేర హైస్పీడ్ కారిడార్ నిర్మించాలని రైల్వే నిర్ణయించింది. ఈ కారిడార్‌ను బెంగళూరు వరకు విస్తరించాలని భావిస్తోంది.

దీంతోపాటు మైసూరు-చెన్నై మధ్య నిర్మించ తలపెట్టిన హైస్పీడ్ రైలు కారిడార్‌ను కూడా హైదరాబాద్ వరకు విస్తరించాలని యోచిస్తోంది. అదే జరిగితే హైదరాబాద్ నుంచి ముంబై, చెన్నై, బెంగళూరుకు మధ్య ప్రయాణ దూరం గంటల్లోకి తగ్గిపోతుంది.ప్రస్తుతం ముంబై-అహ్మదాబాద్ మధ్య జపాన్ సంస్థ సాంకేతికత, ఆర్థిక సాయంతో హైస్పీడ్ కారిడార్ నిర్మిస్తున్నారు. ఈ మార్గంలో జపాన్ తయారీ బుల్లెట్ రైలు నడవనుంది. ఆ తర్వాతి దశలో మరిన్ని హైస్పీడ్ కారిడార్లు నిర్మించనున్నారు. వాటిలో పైన పేర్కొన్న హైదరాబాద్-ముంబై, హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-చెన్నై మార్గాలు కూడా ఉన్నాయి. వీటిలో హైదరాబాద్-చెన్నై, హైదరాబాద్-బెంగళూరు కారిడార్లను ఎలివేటెడ్, భూగర్భ మార్గాల్లో నిర్మిస్తారు.