AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కెమెరాకు చిక్కిన‌ అరుదైన జింక.. తెల్లగా మెరిసిపోతూ..వీడియో

కెమెరాకు చిక్కిన‌ అరుదైన జింక.. తెల్లగా మెరిసిపోతూ..వీడియో

Samatha J
|

Updated on: Feb 10, 2025 | 12:18 AM

Share

సాధారణంగా జింకలు బ్రౌన్‌ కలర్‌లో ఉంటాయి. ఇంకా చెప్పాలంటే ఆకాశంలో నక్షత్రాల్లా ఒంటినిండా చుక్కలతో బంగారు వర్ణంలో మెరుస్తూ చెంగు చెంగున ఎగిరే జింకలను చూశాం. అలాగే చెట్ల కొమ్మలను పోలి లతల్లా మెలి తిరిగి ఉండే కొమ్ములు కలిగిన జింకలనూ చూశాం. వీటిని దుప్పి అంటారు. మరి మంచుశిల్పంలా తెల్లని వర్ణంలో ఉండే జింకను ఎప్పుడైనా చూశారా? అవును జింకల్లో తెల్ల జింకలు అరుదుగా కనిపిస్తాయి. తాజాగా అరుదైన తెల్లని అల్బినో జింక తాలూకు వీడియో ఒక‌టి ప్రస్తుతం నెట్టింట బాగా వైర‌ల్ అవుతోంది. 

ఒక అడవి దగ్గర మంచులో అరుదైన తెల్లటి జింక నిలబడి ఉంది. మంచులో దవళవర్ణంలో మెరిసిపోతూ కనిపించిన ఆ జింకను చూసి ఓ మహిళ ముచ్చటపడిపోయింది. వెంటనే తన కెమెరాలో దాన్ని బంధించింది. అనంత‌రం ఆ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. “అద్భుతంగా ఉంది. ఈ జింక గులాబీ రంగు కళ్లను బట్టి నిజమైన అల్బినో అని చెప్పగలం. ఆ సుంద‌ర మ‌నోహార‌ దృశ్యాన్ని మాట‌ల్లో వ‌ర్ణించ‌లేం” అని ఆమె రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైర‌ల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజ‌న్లు త‌మ‌దైన‌శైలిలో స్పందిస్తున్నారు. అయితే, ఆమె ఈ అరుదైన జింక‌ను ఎక్కడ చూసింది మాత్రం చెప్పలేదు. కానీ వీడియో తెగ వైరల్‌ అవుతూ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఇక అల్బినో జింకలు అత్యంత అరుదుగా క‌నిపిస్తుంటాయి. ప్రతీ లక్ష జింక జననాలలో ఒకటి మాత్రమే ఇలా శ్వేత వ‌ర్ణంతో ఉంటుంద‌ట‌. నిజమైన అల్బినో జింకలకు మెలనిన్ పూర్తిగా ఉండదు. ఫలితంగా స్వచ్ఛమైన తెల్లటి బొచ్చు, విలక్షణమైన గులాబీ కళ్లు ఉంటాయి