రోడ్డుపై అర్థరాత్రి వేళ రష్యన్ అమ్మాయి వీరంగం.. వీడియో వైరల్
ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో రోడ్డుపై ఒక రష్యన్ అమ్మాయి చేసిన హైడ్రామా పోలీసుల్ని షాక్‌కు గురి చేసింది. వీఐపీ మార్గ్ రోడ్డులో అర్ధరాత్రి సమయంలో ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. వేగంగా వస్తున్న ఇండిగో కారు యాక్టివాను ఢీకొట్టింది. స్కూటీపై ముగ్గురు యువకులు ఉన్నారు.
కారు ఢీకొన్న తీరు చాలా తీవ్రంగా ఉండటంతో స్కూటర్ నడిపే వ్యక్తి కొన్ని మీటర్ల దూరంలో పడిపోయాడు. మిగతా ఇద్దరికి కూడా తీవ్ర గాయాలు కావడంతో వారిని ఆస్పత్రికి తరలించారు. కారులో ఒక యువకుడు, రష్యన్ అమ్మాయి ఉన్నారు. వారిద్దరూ ఫుల్లుగా మద్యం తాగి ఉన్నారు. కాగా.. ఢీకొట్టిన తర్వాత రష్యన్ అమ్మాయి కారు నుంచి దిగి తన భాషలో అక్కడున్న వారిని దుర్భాషలాడడం ప్రారంభించింది. ఆ విదేశీ మహిళ పోలీసులను సైతం దూరంగా నెట్టింది. ఈ ప్రమాదానికి గల కారణాన్ని పోలీసులకు తెలిపిన స్థానికులపై దాడికి యత్నించింది.
వైరల్ వీడియోలు

పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్ మండిపాటు

ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య

అరె ! కుక్క కోసం రూ.50 కోట్లా వీడియో

గుడ్లు పెట్టే వరకేనండోయ్.. ఆ తర్వాత తల్లి పక్షి జంప్ ..

ఎండతాపాన్ని తట్టుకోలేకపోయిన పాము..పాపం ఇలా..వీడియో

బ్రో.. నీ ఐడియా సూపర్..వీడియో

నడి సముద్రంలో తప్పిపోయిన మత్స్యకారుడు 95 రోజుల తర్వాత.. వీడియో
