ఓరీ దేవుడా.. కట్టెల కోసం కొండపైకి వెళ్తే.. తల్లీబిడ్డలపై దాడి చేసిన కందిరీగలు.. చివరికి ??

|

Nov 01, 2024 | 11:50 AM

మృత్యువు ఏ నిమిషంలో ఎవరిని కబళిస్తుందో ఎవరూ ఊహించలేరు. అల్లూరి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో ఓ తల్లీ బిడ్డలు కందిరీగల దాడిలో ప్రాణాలు కోల్పోయారు. డుంబ్రిగూడ మండలం జోడిగూడ గ్రామంలో పేద గిరిజన కుటుంబానికి చెందిన కిల్లో ఊర్మిళ కట్టల కోసం కూతుర్ని చంకన ఎత్తుకొని కొండపైకి వెళ్ళింది.

రెండేళ్ల చిన్నారి గీతాంజలిని పక్కన పెట్టి కట్టెలు ఏరుకుంటుండగా ఏమైందో ఏమో కానీ ఒక్కసారిగా కూతురు గీతాంజలి ఏడ్చింది. చూసేలోగా కందిరీగలు ఆ చిన్నారిని చుట్టుముట్టాయి. ఆ చిట్టి తల్లి తల్లడిల్లుతుంటే ఆ తల్లి గుండె తరుక్కుపోయింది. చిన్నారిని రక్షించేందుకు కందిరీగలను తరిమే ప్రయత్నం చేసింది. దీంతో ఆ కందిరీగలు ఊర్మిళ పైనా దాడి చేశాయి. తీవ్రంగా గాయపడి అపస్మారకస్థితిలోకి వెళ్లిన తల్లీ కూతుళ్లను స్థానికులు గుర్తించి అరకులోయ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ చిన్నారి గీతాంజలి ప్రాణాలు కోల్పోయింది. మెరుగైన వైద్య సాయం కోసం తల్లి ఊర్మిళను విశాఖ తరలిస్తుండగా.. మార్గమధ్యలో ఆమె ఊపిరి వదిలింది. దీంతో జోడిగూడలో విషాదం అలుముకుంది. ఇదే జిల్లాలో జరిగిన మరో ఘటనలో తేనెటీగల దాడిలో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. పెదబయలు మండలం వైకుంఠవరంలో ఇంటి ముందు ఆడుకుంటున్న అన్నాచెల్లెలిపై తేనెటిగలు స్వైర విహారం చేశాయి. అభం శుభం తెలియని ఆ చిన్నారులు గాయపడి ఏడుస్తూ ఉన్నారు. ఇంతలో గ్రామస్థులు, కుటుంబ సభ్యులు సపర్యలు చేశారు. అంతలోనే నాలుగేళ్ల గౌరి ప్రాణాలు కోల్పోయింది. అన్న విశ్వ కు తీవ్ర గాయాలు కావడంతో ముంచింగి పుట్టు ఆసుపత్రికి తరలించారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Pushpa 2: ఇండియన్‌ సినిమా చరిత్రలోనే.. నయా రికార్డ్‌ !!

రాత్రి భోజనం మానేస్తున్నారా ?? నిజంగా ధైర్యం ఉంటే ఆ పని చేయండి

Mayonnaise: అమ్మో మయోనైజ్‌.. తింటే అంత డేంజరా ??

Gold Price: బంగారం బరువాయెనా ?? రోజురోజుకు పెరుగుతున్న పసిడి ధరలు

Aha OTT: గుడ్‌ న్యూస్.. ఆహాలో త్వరలో చిరంజీవ