Loading video

కొబ్బరి చిప్పలతో 100 రకాల.. గృహాలంకరణ వస్తువులు

|

Feb 24, 2025 | 8:56 PM

కోనసీమ అంటేనే ముందుగా గుర్తుకు వచ్చేది కొబ్బరి తోటలు, కొబ్బరి చెట్ల నుండి వచ్చే ఉప ఉత్పత్తులు. కొబ్బరి చెట్టు నుండి వచ్చే ప్రతి ఉత్పత్తి మానవాళికి ఉపయోగకరమైనదే. కొబ్బరికాయ కాయ మొదలు దాన్ని నుండి వేరు చేసిన పీచు కూడా అనేక విధాలుగా ఉపయోగపడుతుంది.

కొబ్బరి పీచుతో అనేక గృహోప కారణాలకు ఉపయోగపడే ఎకోఫ్రెండ్లీ బొమ్మలు, మేట్లు, పరుపులు అనేక ఉపయోగకరమైన ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. ఇందుకు భిన్నంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం పాశర్లపూడి గ్రామంలో కోకోమంత్ర, ఆక్సిజన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొబ్బరి చిప్పల నుండి 100 రకాల గృహ ఉపకరణాలు తయారు చేయడానికి మహిళలకు శిక్షణనిస్తున్నారు. స్థానిక మహిళలకు ఉపాధి కల్పించాలనే సదుద్దేశంతో కొబ్బరి చిప్పలతో అనేక రకాల గృహ ఉపకరణాలు తయారుచేసే విధానంలో మహిళలకు ట్రైనింగ్ ఇస్తున్నారు. నేటి సమాజంలో ప్లాస్టిక్ గృహోపకరణాలు ఉపయోగించి క్యాన్సర్ బారినపడి ప్రజల అవస్థలు గ్రహించారు కోకో మంత్ర డైరెక్టర్ హరికృష్ణ, ఆక్సిజన్ అసోసియేషన్ చైర్మన్ గంగాధర్. మరొకవైపు పర్యావరణ కాలుష్యము నివారణ, మహిళలకు ఉపాధి అవకాశాలకు తోడ్పాటును ఇస్తుందని ఈ మంచి కార్యక్రమం చేపట్టామని తెలిపారు.. ఈ ట్రైనింగ్‌లో కొబ్బరి చిప్పలతో టీ కప్పులు, కుంకుమ భరిణీలు, ఫ్లవర్ డెకరేషన్, మొబైల్ స్టాండ్లు, ఇంటికి అలంకరణ బొమ్మలు సుమారు 100 రకాల గృహ ఉపకరణాలు తయారుచేసే విధానాన్ని మహిళలకు నేర్పిస్తున్నారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. టికెట్‌ బుకింగ్‌లో కీలక మార్పులు

ఆ నదిలో బురదను పిసికితే బంగారం దొరుకుతుంది.. బకెట్లతో తోడిపోస్తున్న ప్రజలు