Sticks festival: ఇది ఉత్తరాంధ్ర కర్రల సమరం.! కర్రలతో కొట్టుకున్నా గాయాలు కావట.

|

Dec 03, 2023 | 7:07 PM

కర్నూలు జిల్లాలో జరిగే దేవరగట్టు కర్రల సమరం అంటే ఎంతో ప్రసిద్ధి చెందినది. బన్నీ ఉత్సవం పేరుతో జరిగే ఈ జాతరలో మూడు గ్రామాల ప్రజలు దీక్షతో జాతరలో పాల్గొంటారు. ఈ జాతరలో తలలు పగిలేలా కర్రలతో మూడు గ్రామాల ప్రజలు ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటారు. అది అక్కడిసంప్రదాయం. ఈ కర్రల సమరంలో వందల మంది తలలు పగులుతాయి. రక్తం కారుతున్న ఎవరూ వెనుకడుగు వేయరు. సరిగ్గా అలాంటి జాతరే అనకాపల్లి జిల్లాలోనూ నిర్వహిస్తారు.

కర్నూలు జిల్లాలో జరిగే దేవరగట్టు కర్రల సమరం అంటే ఎంతో ప్రసిద్ధి చెందినది. బన్నీ ఉత్సవం పేరుతో జరిగే ఈ జాతరలో మూడు గ్రామాల ప్రజలు దీక్షతో జాతరలో పాల్గొంటారు. ఈ జాతరలో తలలు పగిలేలా కర్రలతో మూడు గ్రామాల ప్రజలు ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటారు. అది అక్కడిసంప్రదాయం. ఈ కర్రల సమరంలో వందల మంది తలలు పగులుతాయి. రక్తం కారుతున్న ఎవరూ వెనుకడుగు వేయరు. సరిగ్గా అలాంటి జాతరే అనకాపల్లి జిల్లాలోనూ నిర్వహిస్తారు. వెదుళ్ల జాతర పేరుతో రెండేళ్లకోసారి ఇక్కడ జాతర నిర్వహిస్తారు. అయితే దేవరగట్టు జాతరలో తలలు పగిలి రక్తం చిందితే… ఇక్కడ మాత్రం ఒక్క రక్తపు బొట్టుకూడా చిందదు. అదే వెదుళ్ల జాతర ప్రత్యేకత. అనకాపల్లి జిల్లా ఎలమంచిలి నియోజకవర్గంలోని దిమిలి గ్రామ శివారులో పచ్చని పంట పొలాల్లో దల్లమ్మ తల్లి ఆలయం ఉంది. ఇక్కడ అమ్మవారికి రెండేళ్లకోసారి జాతర నిర్వహిస్తారు. జాతర లో భాగంగా గ్రామస్తులు గుంపులు గుంపులుగా ఏర్పడి పెద్ద పెద్ద వెదురు కర్రలతో ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటారు. తొలుత ఆ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అక్కడ నుంచి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఈ ఉత్సవానికి చుట్టుపక్కల గ్రామాలతో పాటు.. ఇతర రాష్ట్రాల్లో స్థిరపడిన దిమిలి గ్రామస్తులు సైతం ఈ జాతరకు విధిగా వస్తారని, అది ఇక్కడి ఆనవాయితీ సేనపతి అప్పారావు తెలిపారు.

పూర్వం మరాఠీ దండు గ్రామాలపై దండెత్తుకొచ్చి ప్రజల ధనమానాలను అపహరించుకు పోయే వారట. ఈ క్రమంలో దిమిలి కి చెందిన ఓ బ్రాహ్మణ స్త్రీ దల్లమాంబ.. తన స్నేహితులతో కలిసి ఆడుకుంటుండగా మరాఠీ దండు గ్రామంపై దండెత్తారట. ఈ మరాఠీ దండు నుంచి తనను తాను కాపాడుకోవడమే కాకుండా.. గ్రామం కోసం నదిలో దూకి ప్రాణత్యాగం చేసిందని స్థానికులు చెబుతారు. అప్పట్నుంచి గ్రామ ప్రజల్లో చైతన్యం కలిగించిందని, దల్లమాంబ స్పూర్తితో ప్రజలంతా వెదురు కర్రలు పట్టుకొని మరాఠీ దండుపై ఎదురుదాడికి దిగి గ్రామాన్ని రక్షించుకున్నారట. ప్రజల్లో చైతన్యం నింపిన దల్లమాంబకు ఆలయం నిర్మించి.. ఇలా రెండేళ్లకోసారి ఈ జాతరను నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు. దల్లమాంబ జాతరలో గ్రామంలోని మగవారంతా ప్రత్యేకంగా తెప్పించిన వెదురు కర్రలు పట్టుకొని గుంపులు గుంపులుగా చేరి కొట్టుకుంటారట. అయినా ఎవరికీ ఎలాంటి గాయాలూ కావట, చిన్న రక్తపు బొట్టుకూడా చిందదట. అంతా దల్లమ్మతల్లి మహిమ అంటున్నారు గ్రామస్తులు. ఈజాతర ముగిసిన 5 రోజులకు అదే ప్రాంతంలో బురద ఉత్సవం నిర్వహిస్తారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.

Follow us on