Bathroom brush on Pizza: పిజ్జా పిండిపై బాత్రూమ్ బ్రష్‌లు.. డొమినోస్ తీరుపై మండిపడుతోన్న నెటిజన్లు..
బెంగళూర్‌లోని ఓ డొమినోస్ పిజ్జా స్టోర్ నిర్లక్ష్యానికి పరాకాష్టగా నిలిచింది. హోసా రోడ్‌లో ఉన్న డొమినోస్ అవుట్‌లెట్‌లో పిజ్జా తయారీ కోసం సిద్ధం చేసిన పిండిపై బాత్రూమ్ బ్రష్‌లు ఉంచారు.
బెంగళూర్‌లోని ఓ డొమినోస్ పిజ్జా స్టోర్ నిర్లక్ష్యానికి పరాకాష్టగా నిలిచింది. హోసా రోడ్‌లో ఉన్న డొమినోస్ అవుట్‌లెట్‌లో పిజ్జా తయారీ కోసం సిద్ధం చేసిన పిండిపై బాత్రూమ్ బ్రష్‌లు ఉంచారు. వీటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. ఓ కస్టమర్ డొమినోస్ అవుట్‌లెట్‌కు వెళ్లి పిజ్జా ఆర్డర్ చేసి బయటకు వెళ్లాడు. అయితే పది నిమిషాల తర్వాత తిరిగి వచ్చే సమయానికి స్టోర్ మూసేశారు. అవుట్‌లెట్ వెనకాల డోర్ వద్ద ఎదురు చూడమని చెప్పేసరికి.. అక్కడికి వెళ్లిన సదరు కస్టమర్‌కు కనిపించిన దృశ్యాన్ని స్మార్ట్ ఫోన్‌లో చిత్రీకరించి ట్వీట్ చేశాడు. దీంతో ట్వీట్ క్షణాల్లో వైరల్‌గా మారింది. డొమినోస్ నిర్వాకంపై నెటిజన్లు ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు.వైరల్‌గా మారిన ఈ ట్వీట్ డొమినోస్ నిర్వాహకుల దృష్టికి చేరింది. దీంతో ఈ సంఘటనపై ట్విట్టర్ వేదికగా స్పందించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన రెస్టారెంట్‌పై కఠిన చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఈ సంఘటన నెల క్రితం జరిగిందని తెలిపిన డొమినోస్ సదరు అవుట్‌లెట్‌పై చర్యలు తీసుకున్నట్లు వివరించారు. డొమినోస్ అత్యున్నత ప్రమాణాల పరిశుభ్రత, ఆహార భద్రతను నిర్ధారించడానికి ప్రపంచస్థాయి ప్రోటోకాల్‌కు కట్టుబడి ఉంటుందని కంపెనీ పేర్కొంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Girl letter to Modi: పెన్సిల్ అడిగితే అమ్మ కొడుతోంది.. దీనికి ధరల పెరుగుదలే కారణం కాదా..?
Viral Video: తప్పతాగి చిందులేస్తూ కుతకుత ఉడికే జావలో పడ్డాడు.. చివరకు జరిగింది ఇదే..
