AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Barasala to calf: లేగదూడకు బారసాల.. మచిలీపట్నంలో పెళ్ళిలా వేడుక.. నామకరణం కూడా..(వీడియో)

Barasala to calf: లేగదూడకు బారసాల.. మచిలీపట్నంలో పెళ్ళిలా వేడుక.. నామకరణం కూడా..(వీడియో)

Anil kumar poka
|

Updated on: Sep 02, 2022 | 8:29 PM

Share

మచిలీపట్నంలో ఓ కుటుంబం దూడకు వైభవంగా బారసల నిర్వహించి మూగజీవాల పై ప్రేమను చాటుకున్నారు. దూడకు హారతులు ఇచ్చి, ఉయ్యాలలో కూర్చోబెట్టి , ఇష్టమైన ఆహార పదార్ధాలు తినిపిస్తూ


మచిలీపట్నంలో ఓ కుటుంబం దూడకు వైభవంగా బారసల నిర్వహించి మూగజీవాల పై ప్రేమను చాటుకున్నారు. దూడకు హారతులు ఇచ్చి, ఉయ్యాలలో కూర్చోబెట్టి , ఇష్టమైన ఆహార పదార్ధాలు తినిపిస్తూ బంధు మిత్రుల సమక్షంలో ఘనంగా బారసల జరిపారు. వివరాల్లోకెళితే.. మచిలీపట్నం మంగినపూడి బీచ్ రోడ్డు గోపవానిపాలెంలో మైధిలి అనే మహిళ నివాసం ఉంటున్నారు. ఆమె గత పదేళ్లుగా ఆవును పెంచుకుంటున్నారు. సొంత బిడ్డలా చూసుకుంటున్న ఆవు “బంగారం’ ఆగష్టు 1న దూడకు జన్మనిచ్చింది. దూడకి లక్ష్మీ అని నామకరణం చేసి ఆగస్ట్‌ 28న . బంధుమిత్రుల సమక్షంలో సంప్రదాయ పద్దతిలో పూజలు నిర్వహించారు. దూడను ఉయ్యాల్లో పడుకోబెట్టి పాటలు పాడుతూ హరతులు ఇచ్చి అట్టహాసంగా బారసాల చేశారు. ఈ వేడుకకు హాజరైన ప్రతి ఒక్కరు అ మూగజీవి పట్ల ప్రేమను చూపిస్తూ పలు రకాల స్వీట్లు, పండ్లు దూడకు తినిపించారు. గత ఏడాది బంగారం అవుకి పుట్టిన సీత అనే దూడకి కూడా ఇదే విధంగా బారసాల నిర్వహించారట. సొంత కుటుంబ సభ్యులను పట్టించుకోని ఈ రోజుల్లో మూగజీవాల పట్ల ప్రేమను చూపించటం పలువురికి స్ఫూర్తిదాయకంగా నిలిచింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Pawan Kalyan: వన్‌ అండ్‌ ఓన్లీ పవర్ స్టార్‌.. ఇది పేరు కాదు ప్రభంజనం.. ఎనలేని పాపులారిటీ..(వీడియో).

Sr.NTR Rare Video: NTRతో అట్లుంటది మరి.. ముహుర్తం టైంకు పెళ్లి అవడంలేదని ఏకంగా..(వీడియో)

Published on: Sep 02, 2022 08:29 PM
Follow Us