Manipur: మణిపూర్‌లో భారీ చోరీ.! రూ.18.85 కోట్లు దోచుకెళ్లిన దుండగులు.

|

Dec 03, 2023 | 11:47 PM

గత కొన్ని నెలలుగా రెండు జాతుల మధ్య నెలకొన్న ఘర్షణలతో అట్టుడుకుతున్న ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో భారీ చోరీ జరిగింది. ఉఖ్రుల్‌ జిల్లాలోని పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌లో దుండగులు కోట్ల కొద్దీ నగదును దోచుకెళ్లారు . పోలీసుల వివరాల ప్రకారం.. గురువారం సాయంత్రం బ్యాంక్‌ మేనేజర్‌, సిబ్బంది రోజూ లావాదేవీలు, డిపాజిట్‌ కార్యకలాపాలను ముగించారు. కస్టమర్లు లోపలికి రాకుండా బ్యాంకు బయట ఉన్న మెయిన్‌ షట్టర్‌ను మూసేసి లోపల పనిచేసుకుంటున్నారు.

గత కొన్ని నెలలుగా రెండు జాతుల మధ్య నెలకొన్న ఘర్షణలతో అట్టుడుకుతున్న ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో భారీ చోరీ జరిగింది. ఉఖ్రుల్‌ జిల్లాలోని పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌లో దుండగులు కోట్ల కొద్దీ నగదును దోచుకెళ్లారు . పోలీసుల వివరాల ప్రకారం.. గురువారం సాయంత్రం బ్యాంక్‌ మేనేజర్‌, సిబ్బంది రోజూ లావాదేవీలు, డిపాజిట్‌ కార్యకలాపాలను ముగించారు. కస్టమర్లు లోపలికి రాకుండా బ్యాంకు బయట ఉన్న మెయిన్‌ షట్టర్‌ను మూసేసి లోపల పనిచేసుకుంటున్నారు. ఆ సమయంలో సుమారు 10 మంది గుర్తు తెలియని సాయుధ దుండగుల అకస్మాత్తుగా లోపలికి ప్రవేశించారు. స్ట్రాంగ్‌ రూమ్‌ దగ్గర విధుల్లో ఉన్న బ్యాంక్‌ మేనేజర్‌, సెక్యూరిటీ సిబ్బందిపై దాడి చేశారు. అనంతరం బ్యాంకులో ఉన్న రూ.18.85 కోట్ల నగదును దోచుకుని అక్కడి నుంచి ఉడాయించారు. ఈ దొంగతనానికి సంబంధించిన విజువల్స్‌ బ్యాంకులోని సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డయ్యాయి. దుండగులు ఏకే రైఫిల్స్ సహా పలు ఆయుధాలతో లోపలికి ప్రవేశించినట్లు సీసీటీవీ దృశ్యాల్లో కనిపించాయి. ఆ ఫుటేజ్ ఆధారంగాదుండగుల్ని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. కాగా, మే 3న జాతి ఘర్షణలు చెలరేగిన తర్వాత మణిపూర్‌ రాష్ట్రంలో ఇది మూడో భారీ దోపిడీ ఘటన కావడం గమనార్హం.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.

Published on: Dec 03, 2023 10:11 PM