Crime Video: మొన్న సీమా.. నేడు సానియా.. ప్రేమ కోసం భారత్‌కు బంగ్లా మహిళ.. వీడియో.
దేశ సరిహద్దులను దాటి మరీ ప్రేమ కోసం భారత్‌కు తరలివస్తున్నారు ప్రియురాళ్లు. మొన్న తన ప్రియుడు సచిన్ కోసం పాకిస్తాన్ నుంచి భారత్‌కు వచ్చిన సీమా హైదరీ కహానీ మరవకముందే మరో మహిళ తన ప్రియుడి కోసం దేశ సరిహద్దులు దాటి మరీ భారత్‌కు చేరుకుంది. లేటెస్టుగా బంగ్లాదేశ్‌కు చెందిన సానియా అఖ్తర్ తన భర్త కోసం భారత్ వచ్చానని చెబుతోంది. సానియా అఖ్తర్ బంగ్లాదేశ్ మహిళ.
దేశ సరిహద్దులను దాటి మరీ ప్రేమ కోసం భారత్‌కు తరలివస్తున్నారు ప్రియురాళ్లు. మొన్న తన ప్రియుడు సచిన్ కోసం పాకిస్తాన్ నుంచి భారత్‌కు వచ్చిన సీమా హైదరీ కహానీ మరవకముందే మరో మహిళ తన ప్రియుడి కోసం దేశ సరిహద్దులు దాటి మరీ భారత్‌కు చేరుకుంది. లేటెస్టుగా బంగ్లాదేశ్‌కు చెందిన సానియా అఖ్తర్ తన భర్త కోసం భారత్ వచ్చానని చెబుతోంది. సానియా అఖ్తర్ బంగ్లాదేశ్ మహిళ. ఆమెకు బంగ్లాదేశ్‌లోని ఢాకాలో కల్టీ మ్యాక్స్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో పనిచేసే సౌరభ్ తో పరిచయం ఏర్పడినట్లు సమాచారం. సానియా, సౌరభ్‌లు 3 ఏళ్ల క్రితమే పెళ్లి చేసుకున్నారని . వీరిద్దరి ఓ ఏడాది కొడుకు కూడా ఉన్నాడు. కొన్నాళ్ల తర్వాత సౌరభ్ బంగ్లాదేశ్ నుంచి భారత్ కు వచ్చేశాడు. ఆ తరువాత సానియాతో కాంటాక్ట్ లేకుండా పోయాడని సమాచారం. ఈ క్రమంలో తనను పెళ్లి చేసుకుని, తన బిడ్డకు తండ్రైన సౌరభ్‌ను కలిసేందుకు వీసా తీసుకుని మరీ భారత్ వచ్చింది. కొడుకును కూడా వెంటబెట్టుకుని మరీ నోయిడాకు వచ్చింది. అయితే ఆమె ఇక్కడకు వచ్చాక షాకింగ్ న్యూస్ తెలుసుకుంది. తన భర్త తనను కాదని మరో మహిళను పెళ్లి చేసుకున్నాడని తెలుసుకుంది. దీంతో తన భర్త తనకు ఆశ్రయం కల్పించడం లేదని, తాను మోసపోయానని తెలుసుకుంది. ఈ ఉదంతం నోయిడా పోలీసుల వరకూ చేరింది. తనకు న్యాయం చేయాలని పోలీసు అధికారులను వేడుకుంది సానియా అఖ్తర్. ఆమె తెలిపిన వివరాల ప్రకారం బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సౌరభ్‌ను ఎట్టిపరిస్థితుల్లోనూ విడిచిపెట్టేది లేదని బాధిత మహిళ తెలిపింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...