పోస్ట్ మార్టం రూములో దానంతటదే కదిలిన నిచ్చెన !! నెట్టింట వైరల్ అవుతున్న షాకింగ్ వీడియో
దెయ్యాలు ఉన్నాయా..లేవా అన్న విషయం పక్కన పెడితే.. పోస్ట్ మార్టం గదిలో స్వయంగా కదిలిన ఓ నిచ్చెన అందరినీ అదరగొట్టేసింది. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. వీడియో చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఈ షాకింగ్ సంఘటన ఉత్తరప్రదేశ్‌లో వెలుగు చూసింది. ఉత్తరప్రదేశ్‌లోని ఓ ఆసుపత్రిలోని పోస్ట్‌మార్టం గదిలో కర్ర నిచ్చెన స్వయంగా దానంతట అదే మనిషి నడిచి వెళ్తున్నట్టు వెళ్తోంది.
దెయ్యాలు ఉన్నాయా..లేవా అన్న విషయం పక్కన పెడితే.. పోస్ట్ మార్టం గదిలో స్వయంగా కదిలిన ఓ నిచ్చెన అందరినీ అదరగొట్టేసింది. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. వీడియో చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఈ షాకింగ్ సంఘటన ఉత్తరప్రదేశ్‌లో వెలుగు చూసింది. ఉత్తరప్రదేశ్‌లోని ఓ ఆసుపత్రిలోని పోస్ట్‌మార్టం గదిలో కర్ర నిచ్చెన స్వయంగా దానంతట అదే మనిషి నడిచి వెళ్తున్నట్టు వెళ్తోంది. ఆ దృశ్యాలు వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. పోనీ ఎవరైనా దానిని అలా కదుపుతున్నారా అనుకుంటే… అక్కడ ఎవరూ లేరు. నిర్మాణుష్యంగా ఉన్న ఆ గదిలో కర్ర నిచ్చెన వింతగా శబ్ధం చేసుకుంటూ నడుచుకుంటూ వెళ్లింది. ఈ దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ ఘటన బరేలీలోని ఎస్‌ఆర్‌ఎంఎస్ మెడికల్ కాలేజీ పోస్ట్‌మార్టం హౌస్‌లో రికార్డ్ అయినట్టుగా తెలిసింది. దానిని ఎవరో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో అది విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వీడియోను ఇప్పటికే దాదాపు 7 లక్షలమంది వీక్షించారు. వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. నిచ్చెన కదలిక వెనుక కనిపించని శక్తి ఉందని కొందరు అభిప్రాయపడ్డారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పాపం.. ఈ దొంగ పరిస్థితి ఎవరికీ రాకూడదు !! రైలు కిటికీకి వేలాడుతూ
ఆనందంగా జరుగుతున్న వేడుక.. అంతలోనే..
భారీగా ట్రాఫిక్ జామ్.. ఫుట్ ఓవర్ బ్రిడ్జిపై దూసుకెళ్లిన ఆటో
ప్రపంచంలోనే అత్యంత పొడవైన జడ ఆమెసొంతం
ఇస్రోలో విషాదం.. సైంటిస్ట్ హఠాన్మరణం !! ఎలాగంటే ??
క్యాండీ క్రష్లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

