Viral Video: అంబాజీపేటలో బాహుబలి పనసపండు.. 80 కేజీల బరువు ఉన్న పనసపండు.
ఇటీవల వింత వింత సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. మొన్నటికి మొన్న మధ్యప్రదేశ్‌లో వేపచెట్టుకు మామిడికాయలు కాసి ఆశ్చర్యపోయేలా చేసాయి. ఇప్పుడు తాజాగా పనసపండు అందరినీ అవాక్కయ్యేలా చేస్తోంది. అయితే ఇది మరే ఇతర చెట్టుకూ కాయలేదు.. పనస చెట్టుకే కాసింది. కాకపోతే సాధారణం కంటే అధిక బరువు తూగడమే దీని ప్రత్యేకత. సాధారణంగా ఓ మోస్తరు పెద్ద పనసపండు అయితే 25 నుంచి 30 కేజీల బరువు తూగుతుంది.
ఇటీవల వింత వింత సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. మొన్నటికి మొన్న మధ్యప్రదేశ్‌లో వేపచెట్టుకు మామిడికాయలు కాసి ఆశ్చర్యపోయేలా చేసాయి. ఇప్పుడు తాజాగా పనసపండు అందరినీ అవాక్కయ్యేలా చేస్తోంది. అయితే ఇది మరే ఇతర చెట్టుకూ కాయలేదు.. పనస చెట్టుకే కాసింది. కాకపోతే సాధారణం కంటే అధిక బరువు తూగడమే దీని ప్రత్యేకత. సాధారణంగా ఓ మోస్తరు పెద్ద పనసపండు అయితే 25 నుంచి 30 కేజీల బరువు తూగుతుంది. కానీ ఈ పనసపండు ఏకంగా 80 కిలోల బరువు తూగింది. ఇది స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. అందరూ దానిని చూసి బాహుబలి పనసపండు అంటున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేటలో అబ్బుర పరుస్తున్న భారీ బాహుబలి పనస పండు…భారీ పొడవుతో, 80 కిలోల బరువుతో అందరినీ ఆకట్టుకుంటోంది. పి.గన్నవరం లంకలో ఉండే పనస చెట్లనుంచి పనస పండు తెచ్చామని పళ్ళ వ్యాపారి తెలిపారు. సాధారణంగా పనసపండు 25,30 కేజీలు బరువు మాత్రమే వుంటుందని ఇది ఏకంగా 80 నుండి 90 కేజీల బరువు ఉందని చెబుతున్నారు. తాము 30 ఏళ్లుగా పళ్ళ వ్యాపారం చేస్తున్నామని కానీ ఇంత పెద్ద పనస పండు ఎప్పుడు చూడలేదు అంటున్నారు పళ్ళ వ్యాపారి. అయితే ఒక పనసపండును ఏకంగా ముగ్గురు మోసుకు రావడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ పనస పండులో సుమారు 800 నుండి 900 పనస తొనలు ఉంటాయని వ్యాపారి తెలిపాడు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.