Baby Royal Tiger: రాయల్ టైగరా మజాకా.. తల్లినే భయపెట్టిన పులి పిల్ల.! వీడియో మాములుగా లేదు..

పసి పిల్లలు ఇంట్లో బుడి బుడి అడుగులు వేస్తూ తిరుగుతూ అల్లరి చేస్తుంటే చూడ్డానికి ఎంతో ముద్దుగా ఉంటుంది. వారి అల్లరి కష్టంగా అనిపించినా ఇష్టంగా భరిస్తుంది తల్లి. ఇది మనుషుల్లోనే కాదు..

Baby Royal Tiger: రాయల్ టైగరా మజాకా.. తల్లినే భయపెట్టిన పులి పిల్ల.! వీడియో మాములుగా లేదు..

|

Updated on: Dec 11, 2022 | 10:09 AM


రాయల్ బెంగాల్ జాతికి చెందిన తెల్లపులి ఎన్‌క్లోజర్‌ ముందు కూర్చుని ఏదో తింటూ ఉంది. ఇంతలో దాని పిల్ల వెనుకనుంచి ఒక్కసారిగా తల్లివైపు దూకుతుంది. ఈ హాఠాత్‌పరిణామానికి తల్లి పులి దెబ్బకు జడుసుకుంది పాపం. ఉలిక్కిపడి కింద పడిపోయింది. ఏదో జంతువు తనపైన ఎటాక్‌చేస్తుందనుకున్న ఆ తల్లిపులి వెనక్కి తిరిగి చూసే సరికి ఎదురుగా తన చిన్నారి కూన బయటకు వచ్చింది. తాను చేసిన పనికి తల్లి పులి భయపడి కింద పడిపోవడంతో ఈ పిల్ల పులి కూడా భయపడింది. తల్లికి కోపం వచ్చిందేమోనని మెల్లగా అక్కడినుంచి పక్కకు వెళ్లిపోయింది. కానీ పులైనా, మనిషైనా తల్లి తల్లే కదా.. తన బిడ్డ చేసిన పనికి ఆ తల్లిపులి కోప్పడలేదు. తన కూనవైపు ప్రేమగా చూస్తుండిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు పులికూన చేసిన పనికి తెగ నవ్వుకుంటున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Snake Bathing: నువ్వు తోపువి బాసూ.. కింగ్‌ కోబ్రాకి స్నానమా..! మగ్‌పై పలుమార్లు కాటు వేసిన పాము.. వీడియో.

Romance Before Marriage: పెళ్లికిముందే శృంగారం చేస్తే ఇక అంతే..! కొత్త చట్టం తీసుకురానున్న ప్రభుత్వం.

Rat Job: ఎలుకల్ని పట్టుకుంటే ..రూ. కోటి 38 లక్షల జీతం..! కొత్త పోస్ట్‌కు మేయర్‌ ప్రకటన..

Follow us