Sabarimala: శబరిమల కొండపై భక్తులకు అష్టకష్టాలు.! దర్శనం కోసం కిలోమీటర్ల క్యూలైన్లు.
శబరిమలలో అయ్యప్ప భక్తులు నరకం చూస్తున్నారు. అత్యంత నిష్టగా దీక్ష ఆచరించి, స్వామి దర్శనం కోసం శబరిమల వెళ్తున్న భక్తులు అక్కడ అష్టకష్టాలు పడుతున్నారు. ఒక్కసారిగా పోటెత్తుతుండటంతో.. శబరిమలలో తొక్కిసలాటలు జరుగుతున్నాయి. ఆలయం దగ్గరే కాదు... చుట్టూ ఎటుచూసినా రద్దీ కనిపిస్తోంది. శబరిమలకు వెళ్లే మార్గాలన్నీ వాహనాలతో నిండిపోతున్నాయి. ఎక్కడికక్కడ ట్రాఫిక్‌జామ్స్‌తో కాలు తీస్తే కాలు కదపలేని పరిస్థితులు నెలకొన్నాయి.
శబరిమలలో అయ్యప్ప భక్తులు నరకం చూస్తున్నారు. అత్యంత నిష్టగా దీక్ష ఆచరించి, స్వామి దర్శనం కోసం శబరిమల వెళ్తున్న భక్తులు అక్కడ అష్టకష్టాలు పడుతున్నారు. ఒక్కసారిగా పోటెత్తుతుండటంతో… శబరిమలలో తొక్కిసలాటలు జరుగుతున్నాయి. ఆలయం దగ్గరే కాదు… చుట్టూ ఎటుచూసినా రద్దీ కనిపిస్తోంది. శబరిమలకు వెళ్లే మార్గాలన్నీ వాహనాలతో నిండిపోతున్నాయి. ఎక్కడికక్కడ ట్రాఫిక్‌జామ్స్‌తో కాలు తీస్తే కాలు కదపలేని పరిస్థితులు నెలకొన్నాయి. సాధారణంగా ప్రతిరోజూ వేలల్లో భక్తులు వచ్చేవారు. కానీ, ఇప్పుడా సంఖ్య ఒక్కసారిగా లక్షల్లోకి చేరింది. దాంతో, భక్తులను కంట్రోల్ చేయడం పోలీసుల వల్ల కూడా కావడంలేదు. ఒక్కసారిగా ఉప్పెన ముంచుకొస్తే ఎలా ఉంటుందో అలా ఉంది శబరిమలలో!. దీంతో, స్వామి దర్శనం చేసుకోకుండానే ఏరుమేలి, పందళం నుంచే వెనక్కి వెళ్లిపోతున్నారు అయ్యప్ప భక్తులు.
శబరిమలలో భక్తుల ఇబ్బందులపై కేరళలో పొలిటికల్ ఫైట్ మొదలైంది. భక్తుల ఇక్కట్లకు, ఓ భక్తుడు మరణించడానికి.. సీఎం పినరయి విజయనే కారణమంటూ ఆందోళనలకు దిగుతోంది బీజేపీ. సరైన ఏర్పాట్లు చేయకపోవడం వల్లే భక్తులు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించింది. విమర్శలు వెల్లువెత్తడంతో అత్యవసర సమీక్ష నిర్వహించారు సీఎం విజయన్. స్పాట్ బుకింగ్‌ను నిలిపివేసి… దర్శన సమయాన్ని అదనంగా మరో గంట పెంచాలని ఆదేశించారు. అలాగే, మహిళలు, చిన్నారుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు పినరయి విజయన్
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.