Helath Tips: ఆ సమస్యతో ఇబ్బందిపడే పురుషులకు దివ్య ఔషధం..అరటిపండు, నెయ్యతో ఈ మిశ్రమం..

|

Apr 27, 2022 | 9:33 AM

ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే పండ్లు అరటి పండ్లు. అరటిపండులో ఔషధగుణాలు మెండు.. సీజన్ తో సంబంధం ఏడాదిపొడుగునా దొరికే అరటి పండుని రోజూ తినే ఆహారంలో చేర్చుకోవడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయని


ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే పండ్లు అరటి పండ్లు. అరటిపండులో ఔషధగుణాలు మెండు.. సీజన్ తో సంబంధం ఏడాదిపొడుగునా దొరికే అరటి పండుని రోజూ తినే ఆహారంలో చేర్చుకోవడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా యోగా, వ్యాయామం చేసే పురుషులు అరటి పండును నెయ్యితో కలిపి పరగడుపునే తినడం వలన కలిగే ప్రయోజనాలు గురించి ఆయుర్వేదంలో ప్రత్యేకంగా చెప్పారు.బరువు తక్కువగా ఉన్నవారు రోజూ ఉదయం పరగడుపున అరటిపండును నెయ్యితో కలిపి తినడం వలన బరువు పెరుగుతారు. అంతేకాదు.. కండరాలు ధృడంగా తయారవుతాయి. రోజూ ఉదయం వ్యాయామం, యోగ చేసేవారు అల్పాహారంగా అరటిపండు నెయ్యి తినడం వలన తక్షణ శక్తి లభిస్తుంది. అలసటకు గురయ్యేవారు, శారీరక శ్రమ అధికంగా చేసే వారు అరటిపండు, నెయ్యి కలిపి తినడం వలన హుషారుగా ఉంటారు. మలబద్దకం సమస్యతో ఇబ్బందిపడేవారికి ఇది మంచి మెడిసిన్‌గా చెప్పవచ్చు. అంతేకాదు గ్యాస్, అసిడిటీ సమస్యలు కూడా తగ్గుతాయి. అరటి పండ్లలో ఉండే ఫైబర్ జీర్ణక్రియను పెరుగుపరచి.. ఆహారం సరిగ్గా జీర్ణం అయ్యేలా చేస్తుంది. ముఖ్యంగా లైంగిక సమస్యలతో ఇబ్బందిపడే పురుషులకు దివ్య ఔషధం..ఈ అరటిపండు నెయ్యి మిశ్రమం. ఈ మిశ్రమం తినటం వల్ల వీర్య కణాల సంఖ్య వృద్ధి చెందడమే కాకుండా శృంగార సంబంధిత సమస్యలు తగ్గుతాయి. చర్మం కాంతి విహీనంగా ఉన్నవారు రోజూ ఉదయం అరటిపండు నెయ్యి మిశ్రమం తినటం వల్ల చర్మం కాంతివంతంగా తయారవుతుంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Tom and jerry: పిల్లికి అడ్డంగా దొరికిపోయిన ఎలుక.. ఏం చేసిందో చూడండి..! టామ్ అండ్ జెర్రీ కంటే ఫన్నీ వీడియో..

Super Star Krishna latest: అయ్యో.. ‘సూపర్‌ స్టార్‌ కృష్ణ’కు ఏమైంది..?చూసి షాక్ లో అభిమానులు..

viral video: వేరే మహిళతో ప్రియుడి పెళ్లి.. తాళికట్టే మంటపానికి ప్రియురాలు ఎంట్రీ..!

Viral Video: నడిరోడ్డుపై వీరనారి.. విశ్వరూపం చూపించేసిందిగా.. ఔరా.. అంటున్న నెటిజనం..

Viral Video: రోడ్డు దాటుతున్న బైక్ ను ఢీ కొట్టి.. ఆగకుండా ఈడ్చుకెళ్లి.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో..