Ayodhya: దీపకాంతులతో మెరిసిపోతున్న అయోధ్య.. సరయు తీరంలో దీపోత్సవం..

Updated on: Oct 20, 2022 | 10:00 AM

దేశ వ్యాప్తంగా దీపావళి సందడి మొదలైంది. రామ జన్మ భూమి అయోధ్య దీపావళికి ముందు దీపోత్సవాన్ని ఘనంగా జరుపుకోనుంది. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అక్టోబర్ 23న అయోధ్యలోని రామ్‌కీ పైడి ఘాట్‌లో ఆరవ దీపోత్సవానికి సన్నాహాలు చేసింది.


దేశ వ్యాప్తంగా దీపావళి సందడి మొదలైంది. రామ జన్మ భూమి అయోధ్య దీపావళికి ముందు దీపోత్సవాన్ని ఘనంగా జరుపుకోనుంది. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అక్టోబర్ 23న అయోధ్యలోని రామ్‌కీ పైడి ఘాట్‌లో ఆరవ దీపోత్సవానికి సన్నాహాలు చేసింది. 12 లక్షలకు పైగా దీపాలు వెలిగించి గిన్నిస్ రికార్డును సొంతం చేసుకోవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 2020లో 5 లక్షల 84 వేల దీపాలు వెలిగించి రికార్డు సృష్టించారు. గతేడాది దీపోత్సవంలో 9 లక్షల మట్టి దీపాలు వెలిగించారు. ఈ ఏడాది దీపోత్సవం కోసం అయోధ్య, లక్నో, గోండా తదితర జిల్లాల నుంచి మట్టి దీపాలను తెప్పించారు. రామ్‌ పడిలో దీపాల సేకరణ చేపట్టింది జిల్లా యంత్రాంగం.ఈ దీపోత్సవంలో దీపాలు.. 30 నిమిషాలకు పైగా వెలుగుతాయని సంబంధిత అధికారులు తెలిపారు. ఇది గత ఐదేళ్లలో దీపాలు వెలిగిన సమయం కంటే చాలా అధికం. ఈ దీపోత్సవాన్ని చూసేందుకు భారీగా ప్రజలు తరలి వస్తారు. అంతేకాదు ఈ దీపోత్సవంలో దీపాలు వెలిగించే ప్రమిదల్లో 30 మిల్లీ లీటర్లకు బదులుగా 40 మిల్లీలీటర్ల నూనెను పోయనున్నారు. తద్వారా ఎక్కువ సేపు దీపాలు వెలగనున్నాయి. ఇక ఈ దీపోత్సవంలో రాముడు, సీతాదేవి వారి ‘పుష్పక్ విమానం’లో అయోధ్యకు వస్తారు. లేజర్, సౌండ్ షో, సాంస్కృతిక కార్యక్రమాలను కూడా అత్యంత ఘనంగా నిర్వహించనున్నారు. 2021లో ఉత్తరప్రదేశ్ పర్యాటక శాఖ, డాక్టర్ రామ్ మనోహర్ లోహియా అవధ్ విశ్వవిద్యాలయం సంయుక్తంగా అయోధ్యలో దీపోత్సవాన్ని ఏర్పాటు చేశారు. రామ్ కి పైడి ఘాట్‌లలో దీపోత్సవ ప్రదర్శన” కోసం గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Army Dog: ఆర్మీ డాగా మజాకా..! రెండు బుల్లెట్లు దిగినా వెనుకడుగు వేయని ఆర్మీ డాగ్.. ఇద్దరు ముష్కరులు హతం.

woman death: “సమాధిలోకి వెళుతున్నా..చనిపోబోతున్నా..” అంటూ బామ్మ కలకలం..వీడియో

Woman paraded: దొంగ అరాచకం.. మహిళను వీధుల్లో నగ్నంగా తిప్పాడు.. నెట్టింట హల్ చల్ చేస్తున్న వీడియో.

Published on: Oct 20, 2022 09:47 AM