Hyderabad: ఆటోవాలా ఐడియాకు ప్రయాణికులు ఫిదా.! ఆటోకు కూలర్‌ ఏర్పాటు..

Updated on: May 20, 2024 | 9:38 AM

హైదరాబాద్‌లో గురువారం వాతావరణం కాస్త చల్లబడి, వర్షాలు కురిసినా.. మొన్నటివరూ ఎండలు దంచి కొట్టాయి. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరిగిపోయి, ఉక్కపోత, వడగాల్పులతో ప్రజలు అల్లాడిపోయారు. ఇంటినుంచి బయటకు రావాలంటే భయపడేవారు. దీంతో ఓ ఆటో డ్రైవర్‌ వినూత్నంగా ఆలోచించాడు. తన ఆటోఎక్కిన ప్రయాణికులకు ఎండనుంచి ఉపశమనం లభించేలా ఏర్పాటు చేసి అందరినీ ఆకట్టుకున్నాడు.

హైదరాబాద్‌లో గురువారం వాతావరణం కాస్త చల్లబడి, వర్షాలు కురిసినా.. మొన్నటివరూ ఎండలు దంచి కొట్టాయి. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరిగిపోయి, ఉక్కపోత, వడగాల్పులతో ప్రజలు అల్లాడిపోయారు. ఇంటినుంచి బయటకు రావాలంటే భయపడేవారు. దీంతో ఓ ఆటో డ్రైవర్‌ వినూత్నంగా ఆలోచించాడు. తన ఆటోఎక్కిన ప్రయాణికులకు ఎండనుంచి ఉపశమనం లభించేలా ఏర్పాటు చేసి అందరినీ ఆకట్టుకున్నాడు. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆటోవాలా ఐడియాను తెగ మెచ్చుకుంటున్నారు.

ఈ ఆటోవాలా.. త‌న ఆటో వెనుక‌భాగంలో చిన్న కూల‌ర్ ఏర్పాటు చేసి అంద‌ర్నీ ఆక‌ర్షించాడు. ఉక్కపోత‌, వేడిగాలుల నుంచి ప్రయాణికుల‌కు ఉప‌శ‌మ‌నం క‌లిగించేలా ఇలా ఏర్పాటు చేసిన‌ట్లు అత‌డు తెలిపాడు. ఎండవేళ ఈ కూలింగ్‌ ఆటో ఎక్కేందుకు ప్రయాణికులు పోటీ పడుతుండటంతో ఆటోవాలా సంతోషం వ్యక్తం చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజ‌న్లు నీ ఐడియా అదుర్స్ బ్రద‌ర్ అంటూ కొనియాడుతున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.