Viral Video: బైక్‌ ట్యాక్సీ రైడర్‌తో ఆటో డ్రైవర్ దురుసు ప్రవర్తన.. వీడియో వైరల్..

|

Mar 16, 2023 | 9:52 PM

ఇటీవల ఓలా, ఉబర్‌, ర్యాపిడో బైక్ టాక్సీలు వచ్చాక సామాన్యుడి ప్రయాణం ఈజీ అయ్యింది. ఇక, ట్యాక్సీలు అందుబాటులోకి రావడంతో కొన్ని సిటీల్లో ఆటోలకు డిమాండ్‌ తగ్గిపోయింది. దీంతో బైక్ ట్యాక్సీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఆటోవాలాలు.

ఇటీవల ఓలా, ఉబర్‌, ర్యాపిడో బైక్ టాక్సీలు వచ్చాక సామాన్యుడి ప్రయాణం ఈజీ అయ్యింది. ఇక, ట్యాక్సీలు అందుబాటులోకి రావడంతో కొన్ని సిటీల్లో ఆటోలకు డిమాండ్‌ తగ్గిపోయింది. దీంతో బైక్ ట్యాక్సీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఆటోవాలాలు. తాజాగా కర్నాటకలో ఓ ఆటో డ్రైవర్‌.. బైక్‌ ట్యాక్సీ డ్రైవర్‌ను వేధింపులకు గురిచేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. బెంగళూరులోని ఇందిరా నగర్‌లో కొన్ని రోజుల క్రితం ఈ ఘటన జరగగా, మార్చి 5న వీడియో రూపంలో నెట్టింట ప్రత్యక్షమయింది. దీంతో ఆ వీడియో కాస్త వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఇందిరానగర్‌ మెట్రోస్టేషన్‌ వద్ద ఓ ఆటో డ్రైవర్‌.. ర్యాపిడో బైక్‌ ట్యాక్సీ డ్రైవర్‌తో అనుచితంగా ప్రవర్తించాడు. అతడి ఫోన్‌ లాక్కుని ఆవేశంతో​నేలకేసి కొట్టాడు. అంతేకాదు అతనిపై రుసరుసలాడుతూ.. సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చాడు. పరాయి దేశానికి చెందిన యువకుడు.. మన పొట్టకొడుతున్నాడంటూ వీడియోలో ఆటో డ్రైవర్ సీరియస్‌ అయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై బైకర్‌.. పోలీసుల ఫిర్యాదు చేయనప్పటికీ వీడియో ఆధారంగా సీరియస్‌గా తీసుకుని విచారణ చేపట్టారు. సదరు ఆటోడ్రైవర్‌ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Naatu Naatu Song in Oscar 2023: వరల్డ్‌వైడ్‌గా ఆస్కార్‌ ఫీవర్‌.. ప్రపంచ వేదికపై తెలుగోడి సత్తా..

Allu Arjun – Shah Rukh Khan: షారుఖ్‌కు దిమ్మతిరిగే పంచ్‌ ఇచ్చిన బన్నీ.. వీడియో.

Allu Arjun: అర్జున్ రెడ్డి 2.O.. వచ్చేస్తున్నాడు పాన్ ఇండియా మూవీ.. కాస్కోండి మరి..!

Published on: Mar 16, 2023 09:52 PM