క్రికెటర్ ఇంట్లో దూరిన కొండచిలువ..ఏం చేశాడో చూడం
ఆస్ట్రేలియా వెటరన్ క్రికెటర్ గ్లెన్ మెక్ గ్రాత్ ఓ సాహసం చేశారు. తన ఇంట్లోకి దూరిన కొండ చిలువలను చాకచక్యకంగా పట్టేసి, తీసుకెళ్లి బయట విడిచి పెట్టేశారు. ఇందుకు సంబంధించిన వీడియోని మెక్ గ్రాత్ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. తన ఇంట్లో కార్పెట్ పైథాన్ చొరబడినట్టు గుర్తించిన మెక్ గ్రాత్ ఒక్కసారిగా షాకయ్యారు. వెంటనే తేరుకున్న ఆయన ధైర్యం చేసి దాన్ని ఇల్లు తుడిచే మాప్ కర్ర సాయంతో పట్టేశారు.
ఆస్ట్రేలియా వెటరన్ క్రికెటర్ గ్లెన్ మెక్ గ్రాత్ ఓ సాహసం చేశారు. తన ఇంట్లోకి దూరిన కొండ చిలువలను చాకచక్యకంగా పట్టేసి, తీసుకెళ్లి బయట విడిచి పెట్టేశారు. ఇందుకు సంబంధించిన వీడియోని మెక్ గ్రాత్ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. తన ఇంట్లో కార్పెట్ పైథాన్ చొరబడినట్టు గుర్తించిన మెక్ గ్రాత్ ఒక్కసారిగా షాకయ్యారు. వెంటనే తేరుకున్న ఆయన ధైర్యం చేసి దాన్ని ఇల్లు తుడిచే మాప్ కర్ర సాయంతో పట్టేశారు. మాప్ కర్రతో కొండచిలువ తలభాగం వద్ద అదిమి పట్టి తోక పట్టుకుని సురక్షితంగా తీసుకెళ్లి చెట్లలో విడిచి పెట్టినట్టు మెక్ గ్రాత్ వెల్లడించారు. ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే.. తన భార్య సారా లియాన్ మెక్ గ్రాత్ సహకారంతో ఇంట్లోకి ప్రవేశించిన మూడు కార్పెట్ కొండ చిలువలను పట్టుకుని బయటకు పంపించినట్టు మెక్ గ్రాత్ తెలిపారు. కొండ చిలువ విషసర్పం కాకపోయినా, అది కాటు వేస్తే దుష్ప్రభావాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. పైగా అది కాటు వేసినా, వెంటనే విడిచి పెట్టదు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Pushpa 2: బంగారం లాంటి అప్డేట్ !! రిలజ్ డేట్ వచ్చేసిందోచ్ !!
Miss. Shetty Mr. Polishetty: హాలీవుడ్ గడ్డపై.. పొలిశెట్టి దిమ్మతిరిగే రికార్డ్
Lavanya Tripathi: పెళ్లికి ముందే కండీషన్ !! విని ఫిదా అయిన చిరు !!