ఆ దేశం లో టీనేజర్లకు సోషల్‌ మీడియాను బ్యాన్‌.. ఎందుకో వీడియో తెలుసుకోండి

Updated on: Dec 13, 2025 | 1:39 PM

డిసెంబర్ 10 నుండి ఆస్ట్రేలియాలో 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం అమల్లోకి వచ్చింది. ఆన్‌లైన్ వేధింపులు, హానికర కంటెంట్ నుండి పిల్లలను రక్షించి, మానసిక ఒత్తిడి తగ్గించడమే లక్ష్యం. ఇది తల్లిదండ్రుల కోరిక మేరకు వచ్చిన చట్టం. నిబంధనలు పాటించని టెక్ కంపెనీలకు భారీ జరిమానాలు విధించనున్నారు. వయసు ధృవీకరణ, మైనర్ల వ్యతిరేకత సవాళ్లుగా ఉన్నాయి.

ప్రపంచంలో.. మొదటిసారిగా టీనేజర్లకు సోషల్‌ మీడియాను బ్యాన్‌ చేసింది ఆస్ట్రేలియా. డిసెంబర్‌ 10న ఈ సంచలనాత్మక నిర్ణయం ఆచరణలోకి వచ్చింది. ఇది ఎలా అమలు కానుందా? అని ఈ ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఓ అంతర్జాతీయ మీడియా సంస్థ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..ఇది తమ ప్రభుత్వ నిర్ణయమేమీ కాదని వ్యక్తిగతంగా విషాదాల్ని ఎదుర్కొన్న తల్లిదండ్రులు కోరుకున్న మార్పు ఇది. మరికొందరు తల్లిదండ్రులు అలాంటి శోకం అనుభవించకూడదనే ఉద్దేశంతో వాళ్లు ఈ చట్టం రావాలని కోరుకున్నారని ప్రధాని ఆల్బనీస్‌ స్పష్టం చేసారు. 16 ఏళ్ల లోపు పిల్లలకు ఇన్‌స్టాగ్రామ్‌, టిక్‌టాక్‌, యూట్యూబ్‌, స్నాప్‌చాట్‌, ఫేస్‌బుక్‌, థ్రెడ్స్‌, ఎక్స్‌లో అకౌంట్‌లు ఉండకూడదు. ఎడ్యుకేషన్‌, ప్రొఫెషనల్‌ సైట్లకు మాత్రం అనుమతి ఉంటుంది. టెక్ కంపెనీలు ఈ నిబంధనను పాటించకపోతే భారీ జరిమానాలు చెల్లించాల్సి వస్తుంది. పిల్లలను ఆన్‌లైన్ వేధింపులు, హానికర కంటెంట్‌కు దూరంగా ఉంచడం.. తద్వారా మానసిక ఒత్తిళ్ల నుంచి రక్షించడం ఈ చట్టం ప్రధాన లక్ష్యాలని ఆల్బనీస్‌ అన్నారు. స్క్రీన్‌లకు అతుక్కుపోకుండా.. పిల్లలు ఆటలు, సంగీతం, పుస్తకాలు వంటి వాటిలో పాల్గొనాలని ఆయన ఆకాంక్షించారు. వయసు ధృవీకరణ కోసం సాంకేతికతను ఉపయోగిస్తామని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు చెబుతున్నాయి. అదెంత వరకు వీలవుతుందో? అనే సందేహాలు వస్తున్నయి. టీనేజర్ల సో.మీ. స్వేచ్ఛకు అడ్డుకట్ట వేస్తున్న ఈ చట్టం.. ఓ అతి నియంత్రణేనని కొందరు ఆస్ట్రేలియన్‌ మైనర్లు ఇప్పటికే కోర్టులను ఆశ్రయించారు. ఆ పిటిషన్లు ప్రస్తుతానికి విచారణ దశలో ఉన్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అరబ్ దేశాలకు చైనా ఊహించని షాక్‌.. సముద్రపు నీటితో ఫ్యూయల్‌ తయారీ

పేద యువతికి పెళ్ళి చేసిన పల్లె.. ఇది కదా మానవత్వం అంటే..

అద్దె ఇల్లు కావాలంటూ వచ్చారు.. దొరికింది దోచుకుపోయారు..

TTD: భక్తుల సేవలపై టీటీడీ కీలక నిర్ణయం.. మరింతగా మెరుగుపరిచేందుకు ప్లాన్

ఆ ఊర్లో ప్రజలందరికీ ఒకటే పేరు.. ఎవర్ని పిలిచినా..