ఆ పరుశురాముడికే మార్గదర్శనం చేసిన ఏకా తాతయ్య గురించి మీకు తెలుసా
పరశురాముడు తల్లిని వధించిన అనంతరం తన గొడ్డలిని కడిగిన పుణ్యక్షేత్రమే కడప జిల్లా అత్యరాల. ఇక్కడి బహుదానదిలో రక్తపు మరకలు తొలగిపోవడంతో ఈ ప్రాంతానికి ఈ పేరు వచ్చిందని స్థల పురాణం చెబుతుంది. పరశురాముడికి ఆశ్రయమిచ్చి, మార్గదర్శనం చేసిన ఏకా తాతయ్య ఈ క్షేత్రంలో జానపద దైవంగా పూజలందుకుంటున్నారు. న్యాయానికి, ధర్మానికి ప్రతీకగా నిలిచిన ఈ దేవుడి ఆలయం వేలాది భక్తులను ఆకర్షిస్తుంది.
అత్యరాల ఈ పేరుకు ఒక పెద్ద కథే ఉంది .. పరశురాముడు తన తల్లిని చంపిన తరువాత తన గొడ్డలిని తీసుకొని అనేక నదులలో ఆ గొడ్డలిని కడిగినా ఎక్కడా కూడా ఆ గొడ్డలిపై ఉన్న రక్తపు మరకలు పోలేదట. అయితే కడప జిల్లా రాజంపేటలో గల కామాక్షి త్రీతేశ్వర ఆలయం వద్ద ప్రవహించే బహుదానదిలో పరశురాముడు గొడ్డలిని కడగగా రక్తపు మరకలు పోయాయని, అందుకే ఇక్కడ పరుశురాముడి చేసిన హత్య రాలిపోయిందని, అందుకే ఈ ప్రాంతాన్ని హత్య రాలె అని పిలిచేవారని, కాలక్రమంలో అది అత్యరాలగా మారిందని స్థల పురాణం చెబుతుంది. అయితే ఇక్కడ ఇంకొక వ్యక్తి గురించి కూడా ప్రస్తావన చేసుకోవాలి పరశురాముడికి ఆ సమయంలో ఆశ్రయం ఇచ్చి మార్గదర్శనం చేసిన ఏకా తాతయ్య… పరశురాముడు ఎక్కడైతే ఉంటాడో ఆయన ఎదురే నేను కూడా ఉంటానని చెప్పారట. అలాగే తన కోరిక మేరకు ప్రస్తుతం బహుద నది ఒడ్డున ఉన్న పరశురామ దేవాలయంలో ఆయన విగ్రహానికి ఎదురుగా ప్రతిష్టించబడ్డారు. కడప జిల్లా అత్తిరాళ్ల ప్రాంతంలో కొలువై ఉన్న ఏకా తాతయ్య.. తరతరాలుగా ప్రజల గుండెల్లో నిలిచిన జానపద దేవుడు. పరశురాముడి కథతో ముడిపడ్డ ఈ క్షేత్రానికి నేటికీ వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు. పురాణ గ్రంథాల్లో ప్రత్యక్ష ప్రస్తావన లేకపోయినా ప్రజల నమ్మకమే ప్రాణంగా నిలిచిన దేవుడు ఏకా తాతయ్య. కడప, రాయచోటి, అత్యరాల పరిసర గ్రామాల్లో గ్రామ రక్షకుడిగా, న్యాయ దేవుడిగా ఆయనను పూజిస్తారు. స్థానిక కథనాల ప్రకారం ఏకా తాతయ్య పరశురాముడికి మాతామహుడిగా అంటే తల్లి రేణుకాదేవి తండ్రిగా ప్రజలు విశ్వసిస్తారు. తల్లి రేణుకను వధించిన అనంతరం పశ్చాత్తాపంతో పరశురాముడు ఈ అత్యరాల ప్రాంతానికి వచ్చాడని కథనం. తన గొడ్డలిపై ఉన్న రక్తాన్ని ఈ ప్రాంతంలోని పవిత్ర జలంలో కడిగి శాంతిని పొందాడని భక్తుల విశ్వాసం. ఆ సమయంలో పరశురాముడికి ఆశ్రయమిచ్చి, మార్గదర్శనం చేసినవాడు ఏకా తాతయ్య అని స్థానికులు చెబుతున్నారు. అందుకే ఏకా తాతయ్యను గ్రామ రక్షకుడిగా, ధర్మానికి ప్రతీకగా భావిస్తారు. ప్రతి ఏటా ఇక్కడ జాతర నిర్వహిస్తారు. ఈ జాతరకుచుట్టుపక్కల జిల్లాల నుంచే కాక దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు తరలివస్తారు. ఏకా తాతయ్య సాక్షిగా ఏదైనా ప్రమాణం చేస్తే న్యాయం జరుగుతుందని న్యాయం, ధర్మం, రక్షణకు ప్రతీకగా జానపద దేవుడిగా నిలిచిన ఏకా తాతయ్య ఇప్పటికీ ప్రజల విశ్వాసానికి కేంద్రబిందువు గానే కొనసాగుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రూ.500 కూడా రూ.50 లాగే అనిపిస్తుంది.. ఖర్చులపై యువతి ఆవేదన
ముందుకు కదలకుండా ఆగిన అతిపెద్ద శివలింగం
ఇరవైల్లోనే రూ. 9 కోట్ల ఇంటిని సొంతం చేసుకుంది
గురువారం అర్ధరాత్రి 12 గంటలకు శ్రీవారి వైకుంఠ ద్వారం క్లోజ్
