ఈ రైల్లోప్రయాణం.. మాటలు కాదు కూర్చునే అలిసిపోతారు వీడియో

Updated on: Jun 26, 2025 | 8:49 PM

ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే వ్యవస్థ మనది. నిత్యం కోట్లాది మందిని చౌకగా, సురక్షితంగా, సౌకర్యవంతంగా తమ గమ్యస్థానాలకు చేర్చుతోంది.. మన భారతీయ రైల్వే. ఓ అలుపెరుగని ప్రయాణం.. మన దేశంలో ప్రతిరోజూ 13 వేలకు పైగా రైళ్లు నడుస్తాయి. సుదూర ప్రయాణాలు చేసే వారు ఎక్కువగా అత్యంత సౌకర్యవంతమైన, చవకైన మార్గంగా రైలు ప్రయాణాన్ని ఎంచుకుంటారు. రైలు ప్రయాణ ఖర్చు తక్కువ. అలాగే, పిల్లలు, పెద్దలకు అనుకూలంగా ఉండే సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. అందుకే దాదాపు అందరూ రైలు ప్రయాణాన్ని ఇష్టపడతారు.

కొందరి ప్రయాణం ఒకట్రెండు రోజులు కూడా ఉంటుంది. కానీ నాలుగు రోజులు ప్రయాణం చేసే రైలు గురించి మీకు తెలుసా? ఆ వివరాలు చూద్దాం పదండి.మన దేశంలోని ఒక రైలు మాత్రం అత్యంత ప్రత్యేకమైంది. ఈ రైల్లో ప్రయాణించేవారు కూర్చుని కూడా అలసిపోతారట. ఎందుకంటే.. ఈ రైలు భారతదేశంలోనే అతి ఎక్కువ దూరం ప్రయాణించే రైలు. దాదాపు 4200 కిలోమీటర్లకు పైగా దూరాన్ని కవర్ చేస్తుంది. ఈ రైలు పేరు వివేక్ ఎక్స్‌ప్రెస్. దేశంలోనే అత్యంత పొడవైన రైలు మార్గం గుండా ఈ ట్రైన్ ప్రయాణిస్తుంది. ఈ రైలు అస్సాంలోని దిబ్రుగఢ్‌ నుంచి కన్యాకుమారి వరకు దాదాపు 4,200 కి.మీ ప్రయాణిస్తుంది. వారానికోసారి పట్టాలెక్కే ఈ రైలు గమ్యస్థానానికి చేరుకునేసరికి సుమారు 80 గంటలు పడుతుంది. ఈ రైలు మార్గంలో 50 స్టేషన్లు ఉన్నాయట. మరో ముఖ్య విషయం ఏంటంటే.. వివేక్ ఎక్స్‌ప్రెస్‌ లో అస్సాంలోని దిబ్రుఘర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రయాణం అంతే అద్భుతంగా ఉంటుంది. అస్సాంలోని పచ్చని తేయాకు తోటల నుంచి కన్యాకుమారి ఇసుక తీరం వరకు భారతదేశంలోని విభిన్న భౌగోళిక దృశ్యాలను సంస్కృతులను మనం చూడొచ్చు.

మరిన్ని వీడియోల కోసం :

భార్య ముక్కు కొరికేసిన భర్త.. అందంగా ఉందని కాదు వీడియో

చీర కట్టినా..చివరికి దొరికిపోయాడు వీడియో

రోడ్డు మధ్యలో స్కూటీ ఆపి..దానిపైనే కునుకేసిన వ్యక్తి ! ఎక్కడంటే వీడియో