Army jawan work outs video: వావ్ అమేజింగ్.. ఆర్మీ జవాన్‌ ఫీట్స్ అదుర్స్..! చూస్తే సెల్యూట్ చెయ్యాల్సిదే..(వీడియో)

ఆర్మీ అంటే ధైర్యానికి, సాహసాలకు ప్రతీక. ఆర్మీలో చేరిన వారికి ఇచ్చే శిక్షణ కఠినాతికఠినంగా ఉంటుంది. ఉదయాన్నే నిద్ర లేవడం, పరుగెత్తడం, కొండలు గుట్టలు ఎక్కడం, నేలపై పాకడం వంటి కార్యక్రమాలు ఉంటాయి. ఎండ, చలి, వర్షం తీవ్రతలను తట్టుకుని..

Army jawan work outs video: వావ్ అమేజింగ్.. ఆర్మీ జవాన్‌ ఫీట్స్ అదుర్స్..! చూస్తే సెల్యూట్ చెయ్యాల్సిదే..(వీడియో)

|

Updated on: Jan 26, 2022 | 9:38 AM

ఆర్మీ అంటే ధైర్యానికి, సాహసాలకు ప్రతీక. ఆర్మీలో చేరిన వారికి ఇచ్చే శిక్షణ కఠినాతికఠినంగా ఉంటుంది. ఉదయాన్నే నిద్ర లేవడం, పరుగెత్తడం, కొండలు గుట్టలు ఎక్కడం, నేలపై పాకడం వంటి కార్యక్రమాలు ఉంటాయి. ఎండ, చలి, వర్షం తీవ్రతలను తట్టుకుని.. అన్ని పరిస్థితులను ఎదుర్కొనేలా ఆ శిక్షణ ఉంటుంది. అందుకే ఇండియన్ ఆర్మీకి చెందిన జవాన్లు చాలా స్ట్రాంగ్‌, ఫిట్‌గా ఉంటారు. వారు తినే ఆహారం కూడా అంతే హెల్తీగా ఉంటుంది. సాధారణంగా ఆర్మీ సిబ్బంది సాహసాలను స్వాతంత్ర్య దినోత్సవం రోజునో, గణతంత్ర దినోత్సవం రోజు, మరేదైనా ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే చూస్తాం. వాటి ఆయుద పరమైన, యుద్ధ కళా నైపుణ్యాలను ప్రదర్శిస్తుంటారు. అయితే, ఇటీవలికాలంలో ఆర్మీ జవాన్లకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియో ఆర్మీ జవాన్ల ఫిట్‌నెస్‌కు అద్దం పట్టేలా ఉంది. దాన్ని చూసి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. వారి ఫిట్‌నెస్‌కు, సాహసాలకు, ఫీట్లకు సవాల్ కొడుతున్నారు. ఇంతకీ ఆ వీడియోలో ఏముందో ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ వైరల్ వీడియోలో ఆర్మీ జవాన్లు అనేక విన్యాసాలు చేయడం మనం చూడొచ్చు. అది చూస్తే కచ్చితంగా ఆశ్చర్యపోతారు. తొలుత ఓ జవాన్.. ఎలాంటి పట్టు లేకుండానే కర్ర సహాయంతో తన పాదాలను బ్యాలెన్స్ చేస్తూ గాలిలో నిలబడతాడు. ఆ తరువాత మరో జవాన్.. చేసిన డిప్స్ చూస్తే వావ్ అంటారు. రెండు పాదాలను రెండు గాజు సీసాలపై ఉంచి.. బాటిల్‌పై ఒక చేతిని సపోర్ట్‌గా పెట్టి మరో చేయించి వెనక్కి మడిచాడు. అలా ఒక్క చేతితోనే బాటిల్స్‌పై డిప్స్ తీసి ఔరా అనిపించాడు. ఇలా చేయాలంటే చాలా సాధన చేయాల్సి ఉంటుంది. మరో సైనికుడు నీటితో నింపిన బకెట్స్‌పై కేవలం నీటిని టచ్ చేస్తూ దాటడం హైలెట్ అని చెప్పాలి. ఆర్మీ జవాన్ల ఫీట్స్‌కు సంబంధించిన వీడియోను ఐపీఎస్ అధికారి దీపాంశు కబ్రా తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ‘‘అద్భుతమైన ఫిట్‌నెస్! శ్రమకు మించిన ప్రత్యామ్నాయం లేదు. కష్టపడే మార్గాన్ని ఎంచుకున్నవారు చరిత్ర సృష్టిస్తారు.’’ అని ఆయన క్యాప్షన్ పెట్టారు.

Follow us
కృషిపట్టుదలకు స్ఫూర్తి ఈ యువతి చేతులు లేకపోయినా కాళ్లతో డ్రైవింగ్
కృషిపట్టుదలకు స్ఫూర్తి ఈ యువతి చేతులు లేకపోయినా కాళ్లతో డ్రైవింగ్
వ్యాయామం చేస్తే ఒళ్ళు నొప్పులు ఎందుకు వస్తాయి..? ఇలా చేస్తే..
వ్యాయామం చేస్తే ఒళ్ళు నొప్పులు ఎందుకు వస్తాయి..? ఇలా చేస్తే..
మహిళలూ ఇది మీకోసమే.. ఈ వ్యాపారంతో అస్సలు తిరుగుండదు.!
మహిళలూ ఇది మీకోసమే.. ఈ వ్యాపారంతో అస్సలు తిరుగుండదు.!
పీఎఫ్ విత్ డ్రా నిబంధనలు మరింత సరళతరం.. రూ. లక్ష వరకూ..
పీఎఫ్ విత్ డ్రా నిబంధనలు మరింత సరళతరం.. రూ. లక్ష వరకూ..
ఎన్నికల్లో టికెట్ కాదు ముఖ్యం.. నామినేషన్ దగ్గరే అసలు సమస్య..
ఎన్నికల్లో టికెట్ కాదు ముఖ్యం.. నామినేషన్ దగ్గరే అసలు సమస్య..
రుతురాజ్ సెంచరీ చేస్తే మ్యాచ్ ఫసక్.. చెన్నై సారథి చెత్త రికార్డు
రుతురాజ్ సెంచరీ చేస్తే మ్యాచ్ ఫసక్.. చెన్నై సారథి చెత్త రికార్డు
ప్రేక్షకులపైకి దూసుకెళ్లిన రేస్‌ కారు.. ఏడుగురు దుర్మరణం..
ప్రేక్షకులపైకి దూసుకెళ్లిన రేస్‌ కారు.. ఏడుగురు దుర్మరణం..
మూడు శుభ గ్రహాలపై శనీశ్వరుడి దృష్టి.. వారికి రాజయోగ ఫలితాలు..!
మూడు శుభ గ్రహాలపై శనీశ్వరుడి దృష్టి.. వారికి రాజయోగ ఫలితాలు..!
6,128 విమానాలు.. 4.71 లక్షల మంది ప్రయాణికులు
6,128 విమానాలు.. 4.71 లక్షల మంది ప్రయాణికులు
ఈ మసాలాలు వాడితే చాలు,ఒంట్లో కొవ్వు కొవ్వొత్తిలా కరిగిపోవాల్సిందే
ఈ మసాలాలు వాడితే చాలు,ఒంట్లో కొవ్వు కొవ్వొత్తిలా కరిగిపోవాల్సిందే