Tatto couple: ప్రపంచంలోనే వింత జంట.. ప్రైవేట్ భాగాలతో సహా ఒంటి నిండా టాటూలతో గిన్నిస్‌ రికార్డ్‌.!

|

Nov 30, 2022 | 4:02 PM

అర్జెంటీనాకు చెందిన ఓ జంట 98 బాడీ మోడిఫికేషన్లు చేయించుకుని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లోకి చేరింది. కళ్లు, నాలుకతో పాటు శరీరం మొత్తం టాటూలతో నింపేసుకున్నారు. విక్టర్ హ్యూగో పెరాల్టా, గాబ్రియేలా పెరాల్టా అనే ఈ జంట

అర్జెంటీనాకు చెందిన ఓ జంట 98 బాడీ మోడిఫికేషన్లు చేయించుకుని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లోకి చేరింది. కళ్లు, నాలుకతో పాటు శరీరం మొత్తం టాటూలతో నింపేసుకున్నారు. విక్టర్ హ్యూగో పెరాల్టా, గాబ్రియేలా పెరాల్టా అనే ఈ జంట ప్రపంచంలోనే తమ శరీరంలో అత్యధిక మార్పులు చేసుకున్న వ్యక్తులుగా రికార్డు సాధించారు. భార్యాభర్తలిద్దరూ ముఖం నుంచి కాళ్ల వరకు పచ్చబొట్లు, ఇంప్లాంట్లు, కుట్లు వేసుకున్నారు. విక్టర్, గాబ్రియేలా ఇద్దరూ తమ శరీరం మొత్తం టాటూలతో పెయింట్ చేయించుకున్నారు. మొత్తం 50 బాడీ పియర్సింగ్‌లు, 8 మైక్రోడెర్మల్, 14 బాడీ ఇంప్లాంట్లు, 5 డెంటల్ ఇంప్లాంట్లు చేసుకున్నారు. అలాగే వారికి 4 ఇయర్ ఎక్స్‌పాండర్లు, 2 ఇయర్ బోల్ట్‌లు, ఫోర్క్‌డ్‌ నాలుక కూడా ఉన్నాయి. అంతే కాదండోయ్‌, ఈ జంట తమ కళ్ల లోపల కూడా టాటూలు వేయించుకుని పూర్తిగా నలుపు రంగులో మార్చేసుకున్నారు. 24 ఏండ్ల క్రితం ఓ మోటర్‌ సైకిల్‌ పోటీల్లో కలుసుకున్నారు. అప్పుడే వీరిద్దరూ ప్రేమలో పడిపోయారు. అనంతరం వివాహం చేసుకున్నారు. ఇద్దరు అభిరుచులూ ఒకటే కావడంతో.. 2009 నుంచి ఇలా ఒంటిపై టాటూలు వేసుకోవడం మొదలు పెట్టారు. ఇప్పటివరకు 20 దేశాలను చుట్టివచ్చారు.. ఆయా దేశాల్లోని ఆచార వ్యవహారాలు తెలుసుకుంటూ కొత్త కొత్త స్నేహితులను ఎంతోమందిని సంపాదించుకున్నారు. జీవితాన్ని ఎంజాయ్‌ చేయాలి.. ఆర్ట్‌ను ఎంజాయ్‌ చేయాలి.. ఈ టాటూల్లో ఎన్నో ఆలోచనలు మిలితమై ఉన్నాయంటున్నారు విక్టర్‌ గాబ్రియేలా.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Ghost in hospital: అర్ధరాత్రి ఆస్పత్రికి వచ్చిన దెయ్యం.. సీసీ కెమెరాలో నమ్మలేని నిజాలు.. వీడియో.

Man with street dogs: వీధి కుక్కలే నేస్తాలుగా పుట్‌పాత్‌పై నిద్రపోతున్న వ్యక్తి..! 24 క్యారెట్స్‌ గోల్డ్‌ అంటున్న నెటిజనం..

Massage for Minister: తీహార్‌ జైలు కొత్త ట్విస్ట్‌.. మంత్రి సత్యేంద్రకు మసాజ్‌ చేసింది అతడే వ్యక్తి..! వీడియో

Published on: Nov 30, 2022 04:02 PM