3000 Years Sword: తవ్వకాల్లో బయటపడిన 3 వేల ఏళ్లనాటి ఖడ్గం.. 3 వేల ఏళ్లయినా వన్నెతగ్గని ఖడ్గం..

3000 Years Sword: తవ్వకాల్లో బయటపడిన 3 వేల ఏళ్లనాటి ఖడ్గం.. 3 వేల ఏళ్లయినా వన్నెతగ్గని ఖడ్గం..

Anil kumar poka

|

Updated on: Jun 22, 2023 | 6:03 AM

కాంస్యయుగానికి చెందిన వేల ఏళ్లనాటి ఖడ్గం ఒకటి తవ్వకాల్లో బయటపడింది. జర్మనీలో పురాతత్వ శాస్త్రవేత్తలు జరిపిన తవ్వకాల్లో బయటపడిన ఆ ఖడ్గం దాదాపు 3 వేల ఏళ్లక్రితం నాటిదని చెబుతున్నారు. అయితే ఆ ఖడ్గం ఇప్పటికీ ఏమాత్రం వన్నెతగ్గకుండా ధగధగలాడుతూ శాస్త్రవేత్తలకే ఆశ్చర్యం కలిగించింది.

కాంస్యయుగానికి చెందిన వేల ఏళ్లనాటి ఖడ్గం ఒకటి తవ్వకాల్లో బయటపడింది. జర్మనీలో పురాతత్వ శాస్త్రవేత్తలు జరిపిన తవ్వకాల్లో బయటపడిన ఆ ఖడ్గం దాదాపు 3 వేల ఏళ్లక్రితం నాటిదని చెబుతున్నారు. అయితే ఆ ఖడ్గం ఇప్పటికీ ఏమాత్రం వన్నెతగ్గకుండా ధగధగలాడుతూ శాస్త్రవేత్తలకే ఆశ్చర్యం కలిగించింది. నార్డ్‌లింగెన్‌లోని బవేరియన్ పట్టణంలో జరిపిన తవ్వకాల్లో ఓ పురుషుడు, మహిళ, ఓ చిన్నారి చెందిన సమాధిలో ఈ పొడవైన కత్తి కనిపించినట్టు బవేరియన్ స్టేట్ ఆఫీస్ ఫర్ మాన్యుమెంట్ ప్రొటెక్షన్ తెలిపింది. ముగ్గురిని ఒకరి వెంట మరొకరిని ఖననం చేశారని, వారి మధ్య సంబంధం ఏంటనేది తెలియరాలేదని పేర్కొంది. ఖడ్గాన్ని అద్భుతంగా సంరక్షించడంతో అది ఇప్పటికీ నిగనిగలాడుతూ మెరుస్తోంది. ఇది కాంస్య యుగానికి చెందిన అష్టభుజ కత్తి రకం. దీని అష్టభుజి పిడిని పూర్తిగా కాంస్యంతో తయారుచేశారు. కాంస్య యుగానికి చెందిన వేల ఏళ్లనాటి ఈ కత్తి ఈ ప్రాంతంలో దొరకడం చాలా అరుదైన విషయమని, ఎందుకంటే మధ్య కాంస్య యుగం నాటి సమాధులు శతాబ్దాలుగా లూటీకి గురయ్యాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. నిపుణులైన వారు మాత్రమే ఈ అష్టభుజి ఖడ్గాలను తయారుచేయగలరని, దీని పిడికి రెండు రివిట్లు ఉన్నాయని వివరించారు. ఓవర్‌లే కాస్టింగ్ టెక్నిక్ ద్వారా ఈ కత్తి బ్లేడును రూపొందించారని, అయితే, దీనిపై కట్ మార్కులు కానీ, దుస్తుల్లో ధరించిన ఆనవాళ్లు కానీ లేవని పేర్కొన్నారు. బహుశా దీనిని వేడుకల్లో ప్రదర్శించేందుకు ఉపయోగించి ఉంటారని భావిస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Adipurush Fake News: ఆదిపురుష్‌ విషయంలో అది ఫేక్ న్యూస్‌.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
Newly Couple: పెళ్లింట తీరని విషాదం.. ఫస్ట్ నైట్ రోజే.. ఆవిరైన ఆశలు.. వీడియో.

Prabhas – Kriti sanon: కృతి ఓర చూపులకి ప్రభాస్‌ పడిపోయేనా..? ఆ లుక్స్ ఎవరైనా పడిపోలసిందే..!