వైకల్యాన్ని ఓడించిన విజయ దీపిక.. టేబుల్ టెన్నిస్‌లో జాతీయ పతకాలు
హైదరాబాద్‌లోని డిఫెన్స్ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్న దీపిక తండ్రి భాస్కరరాజు, మాజీ టెన్నిస్ ప్లేయర్ తల్లి అరుణ ప్రోత్సాహంతో విజయ దీపికకు క్రీడలపై మక్కువ పెరిగింది. ప్రత్యేక శిక్షణతో పారా టేబుల్ టెన్నిస్‌లో రాణించింది.
ఆత్మవిశ్వాసం ఉంటే అదే జీవితాన్ని ముందుకు నడిపిస్తుంది. అందుకే గంగపట్నం విజయ దీపిక దివ్యాంగురాలే అయినా.. తనలోని కాన్ఫిడెన్సే పతకాలు సాధించేలా చేసింది. బ్రిటిల్ బోన్ డిసీజ్ తో కదల్లేని స్థితిలో ఉన్నప్పటికీ తల్లి ప్రోత్సాహంతో టేబుల్ టెన్నిస్‌లో దూసుకుపోతోంది. చక్రాల కుర్చీ నుంచే ప్రాక్టిస్ చేస్తూ ఆట పై పట్టు సాధించింది. సాధారణ కదలికలే అతి కష్టం అనుకునే తరుణంలో పంటి కింద నొప్పిని భరిస్తూనే దీపిక టేబుల్ టెన్నిస్‌లో రాణిస్తోంది. ఎముకలను పెళుసుగా మార్చే వ్యాధితో బాధపడుతున్నప్పటికీ.. వైకల్యం.. ఆమె లక్ష్యం ముందు చిన్నబోయింది. మొదట్లో తనూ టెన్నిస్ ఆడేది. ఆ తరవాత తేలిగ్గా ఉండే టేబుల్ టెన్నిస్ వైపు మళ్లింది. ఫిబ్రవరి 2024లో ఇండోర్‌లో జరిగిన జాతీయ స్థాయి ఛాంపియన్‌షిప్‌లో రెండు రజత పతకాలు, ఒక కాంస్యాన్ని గెలుచుకుంది. 14 ఏళ్లకే ఈ అరుదైన విజయంతో పారా స్పోర్ట్స్‌లో ఈ ఘనత సాధించిన అతి పిన్న వయస్కురాలిగా దీపిక నిలిచింది. ఇది తెలుగువారికి నిజంగా గర్వకారణం.
హైదరాబాద్‌లోని డిఫెన్స్ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్న దీపిక తండ్రి భాస్కరరాజు, మాజీ టెన్నిస్ ప్లేయర్ తల్లి అరుణ ప్రోత్సాహంతో విజయ దీపికకు క్రీడలపై మక్కువ పెరిగింది. ప్రత్యేక శిక్షణతో పారా టేబుల్ టెన్నిస్‌లో రాణించింది. ఇండోర్‌లో నవంబర్ 26 నుంచి 28 వరకు జరిగిన యూటీటీ పారా టేబుల్ టెన్నిస్ నేషనల్ ర్యాకింగ్స్ ఛాంపియన్స్ షిప్లో మహిళల క్లాస్ 4 ఫైనల్స్ పోటీల్లో విజయ దీపిక రజత పతకం సాధించింది. అంతేకాదు రన్నర్ అప్‌గా కూడా రాణించి 3 వేల రూపాయల క్యాష్ ప్రైజ్ గెలుచుకుంది. ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..