Kumki Elephant Specialty: పవన్ కల్యాణ్ చెప్పిన కుంకీ ఏనుగుల స్పెషల్ ఇదే.! వీడియో..

|

Aug 11, 2024 | 10:20 PM

ఏనుగమ్మా ఏనుగు మా వూరొచ్చే ఏనుగు అని చిన్నప్పుడు చాలామంది పాట పాడుకుని ఉండొచ్చు. కానీ కొన్ని ఊళ్లు మాత్రం.. అటవీ ఏనుగులను తమ ఊరికి రావద్దనే కోరుకుంటున్నాయి. ఎందుకంటే అవి చేసే విధ్వంసం అంతా ఇంతా కాదు. పంటలను పాడుచేస్తాయి. అడ్డొచ్చే వారిని చంపేస్తాయి. ఊళ్లను ధ్వంసం చేస్తాయి. దీంతో ఏనుగులంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. ఏపీలో చిత్తూరు, పార్వతీపురం ప్రాంతాల్లో గజరాజుల పేరు చెబితేనే ఆందోళన చెందుతారు.

ఏనుగమ్మా ఏనుగు మా వూరొచ్చే ఏనుగు అని చిన్నప్పుడు చాలామంది పాట పాడుకుని ఉండొచ్చు. కానీ కొన్ని ఊళ్లు మాత్రం.. అటవీ ఏనుగులను తమ ఊరికి రావద్దనే కోరుకుంటున్నాయి. ఎందుకంటే అవి చేసే విధ్వంసం అంతా ఇంతా కాదు. పంటలను పాడుచేస్తాయి. అడ్డొచ్చే వారిని చంపేస్తాయి. ఊళ్లను ధ్వంసం చేస్తాయి. దీంతో ఏనుగులంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. ఏపీలో చిత్తూరు, పార్వతీపురం ప్రాంతాల్లో గజరాజుల పేరు చెబితేనే ఆందోళన చెందుతారు. ఎందుకంటే.. వాటి వల్ల జరిగే నష్టం.. వచ్చే కష్టం సంగతి వాళ్లకు తెలుసు. అందుకే.. ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. కుంకీ ఏనుగుల కోసం.. బెంగళూరు ప్రభుత్వంతో మాట్లాడడం.. అక్కడి సర్కారు వాటిని ఇస్తానని చెప్పడంతో గజరాజుల బాధితులకు ఉపశమనం లభించింది. ఇంతకీ ఈ కుంకీ ఏనుగులు ఏం చేస్తాయి? అడవి ఏనుగులను అవి ఎలా దారికి తెస్తాయి? అసలు వాటి స్పెషల్ ఏమిటి?

కుంకీ ఏనుగులు వస్తే.. ఇక అడవి ఏనుగుల బాధ తగ్గుతుంది. జనావాసాల్లోకి వీటి రాకను అడ్డుకోవడానికి వీలుపడుతుంది. కొన్నేళ్లుగా వీటితో పడ్డ సమస్యలు తొలగిపోతాయి. ఎన్నో ఏళ్లుగా ఉన్న సమస్యకు పరిష్కారం లభించినట్లు అవుతుంది. ఇంతకీ కుంకీ ఏనుగులు నిజంగానే అంత ప్రత్యేకమైనవా? అవును ఇవి నిజంగానే స్పెషల్. కుంకీ ఏనుగులంటే.. మావటిలు ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇచ్చిన ఏనుగులు. అడవి ఏనుగులను ఎలా తరిమేయాలో.. వాటిని ఎలా మచ్చిక చేసుకుని అడవిలోకి పంపించాలో.. ఆగ్రహంతో ఉన్న గజరాజులను ఎలా శాంతింపజేయాలో.. ఇలా అన్ని రకాలుగా వాటికి ట్రైనింగ్ ఇస్తారు. అంటే అడవి ఏనుగులను క్యాప్చర్ చేయడానికి వీటిని ఉపయోగిస్తారు. కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో ఇవి ఎక్కువగా ఉంటాయి. కేరళ, గౌహతి ప్రాంతాల్లో వీటికి శిక్షణ ఉంటుంది. వీటిని చిన్నప్పటి నుంచి మావటిలు జాగ్రత్తగా పెంచుతారు. ఏ సందర్భంలో ఎలా నడుచుకోవాలో ప్రత్యేకంగా శిక్షణ ఇస్తారు. అందుకే అవి మావటిలు చెప్పినవాటిని తూచా తప్పకుండా పాటిస్తాయి.

అడవిలో మంద నుంచి వేరు చేసిన ఏనుగులను, కొన్ని ప్రత్యేకమైన అడవి ఏనుగులను.. తీసుకువచ్చి ట్రైనింగ్ ఇస్తారు. కానీ ఓ సాధారణ ఏనుగు.. తన దూకుడు తగ్గించుకుని కుంకీ ఏనుగుగా మారాలంటే.. కనీసం మూడేళ్ల పాటు ట్రైనింగ్ అవసరం. అవి మావటిలు చెప్పే మాటలు వింటే.. వాటికి చెరుకుగడ కాని, బెల్లం కాని ఇస్తారు. దీనివల్ల ఆ ఏనుగుకు, మావటికి మధ్య బంధం ఏర్పడుతుంది. అంతా ఓకే అనుకుంటే.. అప్పుడు వాటిని ఎన్ క్లోజర్ నుంచి బయటకు తీసుకువచ్చి శిక్షణ ఇస్తారు. ఈ ట్రైనింగ్ అంతా డాక్టర్లు, అధికారుల పర్యవేక్షణలో ఉంటుంది. ఈ ట్రైనింగ్ సమయంలో ఆ ఏనుగును మిగతా ఏనుగులతో కలవనిస్తారు. దీనివల్ల అది.. అడవి ఏనుగులను ఒక్కసారిగా చూసినా భయపడకుండా ఉండడం సాధ్యమవుతుంది. తరువాత ఆ ఏనుగును అడవిలోకి ట్రిప్ కోసం మావటి తీసుకెళతాడు. ఇది అక్కడి పరిసరాలకు దానిని అలవాటు పడేలా చేస్తుంది. ఇక లాస్ట్ స్టేజ్ ట్రైనింగ్ లో ఆ ఏనుగులను ఒంటరిగా అడవిలోకి పంపిస్తారు. అవి తిరిగి వస్తే.. వాటికి ట్రైనింగ్ పూర్తయినట్టే. కుంకీ ఏనుగుగా మారినట్టే.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us on