Viral Video: చూడచక్కగా గాడిదల పెళ్లి.. చూతము రారండి.. ఎందుకో తెల్సా..?
కర్నాటకలోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా బెంగళూరులో ఆదివారం, ఈ రోజు ఉదయం కురిసిన భారీ వర్షాలు బెంగళూరులోని చాలా ప్రాంతాలు.. నీట మునిగాయి. అయితే చిత్రదుర్గకు సమీపంలోని ఓ ప్రాంతంలో మాత్రం.. అస్సలు వర్షం పడటం లేదు.
దేశంలో విచిత్ర వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. కొన్నిచోట్ల వాన దంచి కొట్టి.. వరదల బీభత్సం కొనసాగుతుంటే.. మరొకొన్ని చోట్ల వరుణుడి జాడే కనిపించడం లేదు. అటు కర్నాటకలో సైతం భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాల్లో నీట మునిగాయి. ముఖ్యంగా బెంగళూరులో ఆగస్ట్ 11న భారీ వర్షం కురిసింది. ఆగస్ట్ 12, సోమవారం ఉదయం కూడా వర్షం పడటంతో.. పలు ప్రాంతాలను వదరనీరు ముంచెత్తింది.
కానీ చిత్రదుర్గకు సమీపంలోని ఓ గ్రామంలో వర్షాలు పడక రైతులు అల్లాడిపోతున్నారు. దీంతో వర్షం కోసం ప్రజలు గాడిదకు పెళ్లి చేశారు. చిత్రదుర్గం దొడ్డఉల్లార్తి గ్రామంలో వర్షం కోసం ప్రార్థనలు చేసి గాడిదలకు పెళ్లి చేశారు. జిల్లాలోని చల్లకెరె తాలూకా దొడ్డ ఉల్లార్తి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. చల్లకెరె తాలూకాలో చాలా రోజుల నుంచి వర్షాలు పడకపోవడంతో.. వ్యవసాయ పనులు ముందుకు సాగటం లేదు. దీంతో వర్షం కోసం గ్రామస్థులు గాడిదకు పెళ్లి చేశారు. ఒక గాడిదలకు సంప్రదాయబద్ధంగా వివాహం చేసి వర్షం కోసం ప్రార్థిస్తారు. ఇది ఇక్కడ పురాతనమైన ఆచారంగా గ్రామస్థులు చెబుతున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..