Animal Viral Video: చెంబులో తల పెట్టిన పిల్లి..? సాయం చేయబోతే షాక్‌..! వైరల్ అవుతున్న వీడియో…

|

Oct 21, 2021 | 10:02 PM

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలో షాకింగ్‌ ఘటన చోటు చేసుకుంది. నక్కలపల్లి గ్రామంలో ఓ చిరుత పిల్ల తల చెంబులో ఇరుక్కుపోయింది. బయటకు తీయడానికి నానా తిప్పలు పడుతోంది. అటుగా వెళ్తోన్న వైఎస్ఆర్టీపీ ముఖ్య అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి ఆ మూగజీవి అవస్థను చూసి చలించిపోయారు..

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలో షాకింగ్‌ ఘటన చోటు చేసుకుంది. నక్కలపల్లి గ్రామంలో ఓ చిరుత పిల్ల తల చెంబులో ఇరుక్కుపోయింది. బయటకు తీయడానికి నానా తిప్పలు పడుతోంది. అటుగా వెళ్తోన్న వైఎస్ఆర్టీపీ ముఖ్య అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి ఆ మూగజీవి అవస్థను చూసి చలించిపోయారు.. తన వాహనాన్ని ఆపి దాని వద్దకు వెళ్లారు. తల చెంబులో ఇరుక్కుపోయి పిల్లి ఇబ్బంది పడుతోందని భావించిన కొండా రాఘవరెడ్డి.. దానికి సాయం చేద్దామనుకున్నారు. పిల్లికి సాయం చెద్దామని దగ్గరకు వెళ్లి దాన్ని చేతిలోకి తీసుకున్నారు. అప్పటికి గానీ అసలు విషయం తెలియలేదు. ఒక్కసారిగా చిరుతపులి పిల్ల కరవడంతో అవాక్కయ్యారు. అది పిల్లి కాదు చిరుతపులి పిల్ల అని అర్థమై కిందకు వదిలేశారు. ఆ పులి పిల్ల రాఘవరెడ్డి చేతిలో నుంచి దూకి పారిపోయింది. అది పులి పిల్ల అని తెలియగానే, కొండా రాఘవరెడ్డి తన అనుచరులు అక్కణ్నుంచి పరుగులు పెట్టారు. ఘటనపై స్థానిక పోలీసులు, అటవీ అధికారులకు సమాచారం అందించారు. సమీప అటవీ ప్రాంతాల్లో పులి సంచారిస్తున్నట్లు అధికారులు కేసు నమోదు చేసుకున్నారు. చిరుతతో పాటు దాని పిల్లలను కూడా పట్టుకోవటానికి అధికారులు రంగంలోకి దిగారు. YouTube video player
మరిన్ని చదవండి ఇక్కడ: Jr.NTR-Lakshmi Pranathi: సోషల్ మీడియాకు దూరంగా ఎన్టీఆర్ సతిమణీ.. పెళ్లి కాకముందు లక్ష్మీ ప్రణతి ఎలా ఉందో చూశారా..?(ఫొటోస్)

Rashmika Mandanna: అయ్యయ్యో.. అందాల ముద్దుగుమ్మను ఇలా చేశారేంటీ సుకుమార్ సర్.. రష్మిక ఎలా మారిపోయిందో చూశారా..(ఫొటోస్)