MP vs MLA flexi Fight: పండుగవేళ ఫ్లెక్సీ వివాదం ఎంపీ, ఎమ్మెల్యే వర్గాల మధ్య ఫ్లెక్సీల గొడవ.. (వీడియో)
మహబూబాబాద్ జిల్లాలో ఎంపీ కవిత, ఎమ్మెల్యే శంకర్ నాయక్ మధ్య ఫ్లెక్సీల రగడ నెలకొంది. బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు తెలుపుతూ ఎంపీ కవిత వర్గీయులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను ఎమ్మెల్యే అనుచరులు చించివేయడం వివాదాస్పదమైంది.
మహబూబాబాద్ జిల్లాలో ఎంపీ కవిత, ఎమ్మెల్యే శంకర్ నాయక్ మధ్య ఫ్లెక్సీల రగడ నెలకొంది. బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు తెలుపుతూ ఎంపీ కవిత వర్గీయులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను ఎమ్మెల్యే అనుచరులు చించివేయడం వివాదాస్పదమైంది. దీంతో ఆగ్రహానికి గురైన ఎంపీ కవిత అనుచరులు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు మహబూబాబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్‌తో పాటు మరి కొందరిపై కేసు నమోదు చేసినట్లు తెలిసింది.. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే శంకర్ నాయక్.. తన అనుచరులను విడిచి పెట్టాలంటూ అర్థరాత్రి 2 గంటల సమయంలో స్టేషన్‌కు వెళ్లి హల్‌చల్ చేశారు. సీఐ దురుద్దేశంతోనే తన అనుచరులపై వేధింపులకు పాల్పడుతున్నారని ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఆరోపిస్తున్నారు. తన ఇంటిపై దుండగులు దాడి చేస్తే పట్టించుకోని పోలీసులు.. ఫ్లెక్సీ చింపితే మాత్రం ఏకంగా కేసులు పెట్టడం విడ్డూరంగా ఉందన్నారు. ఎంపీ కవిత, ఎమ్మెల్యే రెడ్యానాయక్ అనుచరులు తన ఇంటిపై దాడి చేశారని, వారిపై కూడా కేసులు పెట్టాలని ఆయన ఆరోపిస్తున్నారు. మొత్తానికి ఎంపీ, ఎమ్మెల్యే వర్గపోరుతో టీఆర్ఎస్ కార్యకర్తల్లో గందరగోళం నెలకొందంటున్నారు రాజకీయ విశ్లేషకులు..
మరిన్ని చదవండి ఇక్కడ: Jr.NTR-Lakshmi Pranathi: సోషల్ మీడియాకు దూరంగా ఎన్టీఆర్ సతిమణీ.. పెళ్లి కాకముందు లక్ష్మీ ప్రణతి ఎలా ఉందో చూశారా..?(ఫొటోస్)
Tamilnadu-Kerala Rains: తమిళనాడు, కేరళలో భారీ వర్షాలు…హెచ్చరిస్తున్న వాతావరణ శాఖ.. (వీడియో)
లక్ష.. లక్ష్మీకాసులతో 12 అడుగుల గణపయ్య!
రెండేళ్ల కష్టం నేడు వినాయకుడి రూపం.. పవన్‌కు గిఫ్ట్‌గా!
మర్రి ఆకుపై 2 సెం.మీ గణపయ్య.. మైక్రో ఆర్టిస్ట్ అద్భుతం!
పసుపు కొమ్ములతో పర్యావరణ గణపతి.. జడ్చర్లలో స్పెషల్ వినాయకుడు!
ఇల్లు పీకి పందిరేస్తున్నాయి పంట పొలాలు నాశనం.. పిల్లల పై దాడులు!
బరువు తగ్గాలనుకుంటున్నారా..? CMR-NIN పరిశోధనలో సంచలన నిజాలు
లీటర్‌కు రూ.80 కోట్లు.. తేలు విషం రహస్యం ఇదే!

