Zombie Viruses: వినాశకర పురాతన వైరస్‌ల విజృంభణ.. పొంచివున్న ఉపద్రవం..?

|

Jan 26, 2024 | 5:22 PM

పురావస్తు శాస్త్రవేత్తల తవ్వకాల్లో నిధులు, లంకెబిందెలు లాంటివి బయటపడటం మనం చూశాం. నిధులు దొరికితే మంచిదే.. కానీ అదే ప్రాణాంతకమైన వైరస్‌లు బయటపడితే.. అవును.. అలాంటి ఉపద్రవమే ముంచుకు రావొచ్చని జీవశాస్త్రవేత్తలు మానవాళిని హెచ్చరిస్తున్నారు. 48,500 సంవత్సరాలపాటు ఆర్కిటిక్‌ ఖండంలో మంచు ఫలకాల కింద కూరుకుపోయిన వినాశకర వైరస్‌లు బయటపడుతున్నాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు.

పురావస్తు శాస్త్రవేత్తల తవ్వకాల్లో నిధులు, లంకెబిందెలు లాంటివి బయటపడటం మనం చూశాం. నిధులు దొరికితే మంచిదే.. కానీ అదే ప్రాణాంతకమైన వైరస్‌లు బయటపడితే.. అవును.. అలాంటి ఉపద్రవమే ముంచుకు రావొచ్చని జీవశాస్త్రవేత్తలు మానవాళిని హెచ్చరిస్తున్నారు. 48,500 సంవత్సరాలపాటు ఆర్కిటిక్‌ ఖండంలో మంచు ఫలకాల కింద కూరుకుపోయిన వినాశకర వైరస్‌లు బయటపడుతున్నాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు. పర్యావరణ మార్పులు, భూతాపం కారణంగా మంచు కరిగి ఈ భయంకర వైరస్‌లు బయటికొస్తున్నాయని శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఇన్ని వేల సంవత్సరాలు గడిచినా ఆ వైరస్‌లకు ఇప్పటికీ ఇంకొక జీవికి సోకే సంక్రమణ శక్తులు ఉండొచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. రష్యాలోని సైబీరియా ప్రాంతంలో యకూచి అలాస్‌ సరస్సులో తవ్వితీసిన నమూనాల్లో పురాతన వ్యాధికారక వైరస్‌లను ఇటీవల జీవశాస్త్రవేత్తల బృందం కనుగొంది. వాటిలో కొన్ని రకాల జాంబీ వైరస్‌లుగా వర్గీకరించారు. నిద్రాణ స్థితిలో ఉన్నప్పటికీ ఇవి మానవాళికి, సంక్రమించే ప్రమాదం ఉందా అనే కోణంలో పరీక్షిస్తున్నట్లు ఎయిక్స్‌–మార్సెల్లీ విశ్వవిద్యాలయంలో జన్యు శాస్త్రవేత్త జీన్‌ మైఖేల్‌ క్లావెరీ చెప్పారు. ఆర్కిటిక్‌ ఖండం ఉపరితలంలో 20 శాతం భూభాగం శాశ్వతంగా మంచుతో కప్పబడి ఉంది. అత్యంత చల్లని, ఆక్సిజన్‌రహిత, ఘనీభవించిన ఈ ప్రదేశంలో పెరుగును పడేస్తే 50 వేల సంవత్సరాలౌనా అది పాడవదని, దాన్ని అలాగే తినేయవచ్చని అని క్లావెరీ అన్నారు.

ఈ మంచు ఫలకాల కింది వైరస్‌లు బయటికొచ్చి వ్యాప్తి చెందితే ఎలాంటి రోగాలొస్తాయో ఇప్పుడే చెప్పలేమని, 2014లో సైబీరియాలో తాము ఇదే తరహా వైరస్‌లను పరీక్షించగా వాటికి ఏకకణ జీవులకు సోకే సామర్థ్యం ఉందని తేలినట్లు నెదర్లాండ్స్‌లోని రోటెర్డామ్‌ ఎరాస్‌మస్‌ మెడికల్‌ సెంటర్‌లోని వైరాలజీ శాస్త్రవేత్త మేరియాన్‌ కూప్‌మెన్స్ పేర్కొన్నారు. 2015లోనూ ఇదే తరహా పరీక్షలు చేయగా ల్యాబ్‌లో అభివృద్దిచేసిన జీవులకూ ఈ వైరస్‌లు సోకినట్టు వివరించారు. ఆర్కిటిక్‌ ప్రాంతంలో మానవసంచారం పెరగనంతకాలం వీటితో ప్రమాదం ఉండదని, శతాబ్దాల క్రితం లక్షలాది మందిని పొట్టనబెట్టుకున్న పురాతన పోలియో వ్యాధికారక వైరస్‌లకు ఇప్పటికీ ఆ సంక్రమణ శక్తి ఉండవచ్చన్నారు. మనుషుల రాకపోకలతో అంటువ్యాధులను వ్యాపింపజేసే వైరస్‌లు ఆర్కిటిక్‌ ప్రాంతం దాకా వ్యాపిస్తే అవి, ఇవీ అన్ని కలసి కొత్తరకం ఊహించని వ్యాధుల వ్యాప్తికి కారణమవుతాయని వేరియాన్‌ కూప్‌మెన్స్‌ విశ్లేషించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Follow us on