పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!

Updated on: Jan 19, 2026 | 9:56 AM

అద్దంకిలో అద్భుతం జరిగింది... గజాననుడి గర్భాలయ రహస్యం బయటపడింది... పండుగ రోజు పొలం దున్నుతుండగా రైతు నాగలికి ఏదో తగిలింది. ఏంటా అని చూసిన ఆ రైతు ఆశ్చర్యపోయాడు. అది సాక్షాత్తూ పార్వతీ నందనుడు, వినాయకుడి విగ్రహం. ఆ విగ్రహం విజయనగరరాజుల కాలం నాటిదని తేలింది. ఇక్కడ ఒకప్పుడు భారీ ఆలయం ఉండేదా... అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రాంతంలో తవ్వకాలు జరిపితే మరిన్ని చారిత్రక ఆనవాళ్ళు లభిస్తాయని స్థానికులు కోరుతున్నారు. తాజాగా బయటపడ్డ గజాననుడి విగ్రహానికి జనం పూజలు చేస్తున్నారు. ఇక్కడ ఆలయం కట్టించాలని కోరుకుంటున్నారు.

ప్రకాశం జిల్లా అద్దంకి మండలం చినకొత్తపల్లి గ్రామం ఇప్పుడు ఒక చారిత్రక అద్భుతానికి సాక్ష్యంగా నిలిచింది. సంక్రాంతి పండుగ వేళ పంట పొలానికి నీళ్లు కట్టేందుకు వెళ్లిన రైతుకు.. అనూహ్య రీతిలో ఆ గణనాథుడు దర్శనమిచ్చాడు. రైతు వీరనారాయణ తన మొక్కజొన్న చేనుకు నీరు పెట్టేందుకు నాగలితో దున్నుతుండగా కాలువ గట్టున ఒక రాయి అడ్డుగా ఉంది. రాయిని తొలగించేందుకు మట్టి తీస్తుండగా అదొక విగ్రహంలా కనిపించింది. విగ్రహాన్ని నీటితో శుభ్రం చేయగా.. అద్భుతమైన వినాయక విగ్రహంగా ప్రత్యక్షమైంది. ఈ విగ్రహం సుమారు 14వ శతాబ్దానికి చెందిన విజయనగర రాజుల కాలానికి చెందినదిగా పురావస్తు శాఖ రిటైర్డ్‌ అధికారి జ్యోతి చంద్రమౌళి చెప్పారు. సాధారణంగా వినాయకుడి తొండం ఎడమ వైపు ఉంటుంది, కానీ ఇక్కడ కుడి వైపుకు తిరిగి ఉండటం విశేషం. చేతిలో ఉన్న ఉండ్రాన్ని తింటున్నట్లుగా ఉన్న ఈ శిల్పకళ అత్యంత అరుదైనది. ఈ ప్రాంతంలో గతంలో భారీ శివాలయం ఉండేదని, కాలక్రమేణా అది భూస్థాపితమై ఉండవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ విషయం తెలియగానే చినకొత్తపల్లికి భక్తులు పోటెత్తుతున్నారు

మరిన్ని వీడియోల కోసం :

అదుర్స్ నా బయోపిక్కే..వేణుస్వామి షాకింగ్ కామెంట్స్

పవన్ కళ్యాణ్ ప్లాన్ C.. ఫ్యూచర్ అదే..

కోనసీమలో నాన్ వెజ్ వంటలు.. అందులో చేపల పులుసు స్పెషల్

ఈ కోతుల దూకుడును ఆపేదెలా?