Ambani Wedding: అనంత్-రాధికల ‘మేకిన్ ఇండియా’ వివాహం.. ఆర్థికంగా లాభపడిన స్థానిక వ్యాపారులు.
ఇటీవల జరిగిన అనంత్ అంబానీ- రాధిక వివాహ వేడుక దేశమంతా చర్చనీయాంశంగా మారింది. నలుగురికీ గుర్తుండిపోయేలా సుదీర్ఘ కాలం పాటు సాగిందీ పెళ్లి వేడుక. దేశ, విదేశీ ప్రతినిధులు సందడి చేసిన ఈ వేడుకల్లో సంప్రదాయానికీ పెద్దపీట వేసింది ముకేశ్ అంబానీ కుటుంబం. అనంత్- రాధిక వివాహ వేడుకకు ప్రధాని మోదీ స్వయంగా హాజరయ్యారు. అనంత్- రాధిక వివాహ వేడుకలో సంప్రదాయాలకు పెద్దపీట వేశారు.
ఇటీవల జరిగిన అనంత్ అంబానీ- రాధిక వివాహ వేడుక దేశమంతా చర్చనీయాంశంగా మారింది. నలుగురికీ గుర్తుండిపోయేలా సుదీర్ఘ కాలం పాటు సాగిందీ పెళ్లి వేడుక. దేశ, విదేశీ ప్రతినిధులు సందడి చేసిన ఈ వేడుకల్లో సంప్రదాయానికీ పెద్దపీట వేసింది ముకేశ్ అంబానీ కుటుంబం. అనంత్- రాధిక వివాహ వేడుకకు ప్రధాని మోదీ స్వయంగా హాజరయ్యారు. అనంత్- రాధిక వివాహ వేడుకలో సంప్రదాయాలకు పెద్దపీట వేశారు. భారతీయ సంస్కృతీ సంప్రదాయాల పట్ల నూతన వధూవరులకు ఉన్న గౌరవాన్ని ఇది తెలియజేస్తోంది. భారత సంస్కృతి, సంప్రదాయాలను అనుసరిస్తూ ఎంతో ఆడంబరంగా నిర్వహించిన ఈ వివాహ వేడుక దేశంతో పాటు యావత్ ప్రపంచం దృష్టినీ ఆకర్షించింది.
అంబానీ కుటుంబంలో జరిగిన ఈ పెళ్లితో వస్తు సేవలకు గిరాకీ ఏర్పడింది. ఉత్పత్తి, ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు చిన్న తరహా పరిశ్రమలకు ఊతం లభించింది. ఈ వివాహ వేడుకలో అంబానీ కుటుంబం ‘మేకిన్ ఇండియా’ స్ఫూర్తిని చాటింది. స్థానిక వ్యాపారులకు మద్దతు ఇవ్వడంతో పాటు ఇతర మరిన్ని సంపన్న కుటుంబాలకు స్ఫూర్తిగా నిలిచింది. వివాహ వేడుకకు చాలా రోజుల ముందే జామ్‌నగర్‌లో ప్రీ వెడ్డింగ్ వేడుకలను అంబానీ కుటుంబం నిర్వహించింది. ఇది స్థానికంగా ఆర్థిక వృద్ధికి దోహదం చేసింది. హోటళ్లు, రెస్టారెంట్లు, రవాణా సౌకర్యాలు, దుకాణదారుల ఆదాయంతో పాటు స్థానికంగా ఉపాధి అవకాశాలను మెరుగుపరిచింది. నిరుపేద కుటుంబాలకు చెందిన 50 జంటలకు అంబానీ కుటుంబం దగ్గరుండి వివాహం జరిపించింది. వారికి బంగారం, దుస్తులను కానుకగా అందించింది. భవిష్యత్‌లోనూ మరిన్ని జంటలకు అండగా ఉంటామని తెలిపింది. అంబానీ కుటుంబం 40 రోజుల పాటు నిర్విరామంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించింది. వేలాది మంది ఆకలిని తీర్చింది. సమాజ సేవ, దాతృత్వంలో అంబానీ కుటుంబం ముందు వరుసలో ఉంటుందనడానికి ఇదే నిదర్శనం.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.