Anand Mahindra: ఈ వీడియో చూసి చలించిపోయిన ఆనంద్‌ మహీంద్రా.. దివ్యాంగుడికి ఉద్యోగం..

Anand Mahindra: ఈ వీడియో చూసి చలించిపోయిన ఆనంద్‌ మహీంద్రా.. దివ్యాంగుడికి ఉద్యోగం..

Anil kumar poka

|

Updated on: Jan 13, 2022 | 6:44 AM

Anand Mahindra: సోషల్‌ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉండే ప్రముఖుల్లో పారిశ్రామిక వేత్త ఆనంద్‌ మహీంద్ర ఒకరు. సమాజంలో జరిగే అంశాలపై తనదైన శైలిలో స్పందిస్తుంటారు ఆయన. ఈ క్రమంలోనే..



Anand Mahindra: సోషల్‌ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉండే ప్రముఖుల్లో పారిశ్రామిక వేత్త ఆనంద్‌ మహీంద్ర ఒకరు. సమాజంలో జరిగే అంశాలపై తనదైన శైలిలో స్పందిస్తుంటారు ఆయన. ఈ క్రమంలోనే తాజాగా ఆనంద్‌ మహీంద్ర ట్వి్ట్టర్‌ వేదికగా పోస్ట్‌ చేసిన ఓ వీడియో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆనంద్‌ మహీంద్ర పోస్ట్ చేసిన వీడియోలో.. రెండు చేతులు, కాళ్లు లేని ఓ వ్యక్తి ప్రత్యేకంగా డిజైన్‌ చేయించుకున్న ట్రాలీ వాహనాన్ని నడుపుతున్నాడు. ఢిల్లీకి చెందిన ఈ వ్యక్తి తనకు పెళ్లి అయ్యిందని, ఇద్దరు పిల్లలు ఉన్నారని చెప్పుకొచ్చాడు. పుట్టుకతోనే కాళ్లు, చేతులు లేవని తెలిపిన సదరు వ్యక్తి డబ్బులు సంపాదించడం కోసమే వాహనాన్ని తయారు చేయించుకొని, సరుకుల రవాణా చేస్తూ జీవనం సాగిస్తున్నట్లు సదరు వీడియోలో తెలిపాడు. దీనంతటినీ ఓ వ్యక్తి వీడియోగా తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. దీంతో ఈ వీడియో వైరల్‌గా మారి, చివరికి ఆనంద్‌ మహీంద్ర కంట పడింది.

ఈ విషయమై వెంటనే స్పందించిన ఆనంద్‌.. సదరు వీడియోను రీట్వీట్‌ చేస్తూ.. ఓ పోస్ట్ రాసుకొచ్చారు. ‘ఈ రోజు నా టైమ్‌లైన్‌లో ఈ వీడియో కనిపించింది. తన వైకల్యాన్ని ఎదురించడమే కాకుండా.. ఆత్మగౌరవంతో పని చేసుకుంటున్న ఈ వ్యక్తిని చూసి ఆశ్చర్యపోయా’ అంటూ రాసుకొచ్చారు. ఇక అంతటితో ఆగని మహీంద్ర తమ లాజిస్టిక్స్‌ సంస్థలోని ఓ ఉద్యోగిని ట్యాగ్‌ చేస్తూ.. ‘రామ్‌.. ఇతనికి బిజినెస్‌ అసోసియేట్‌గా ఉద్యోగం ఇప్పించగలరా.?’ అంటూ కామెంట్ చేశారు. దీంతో ప్రస్తుతం ఈ ట్వీట్‌ నెట్టింట వైరల్‌గా మారింది. దివ్యాంగుడి పరిస్థితి చూసి చలించి పోయిన ఆనంద్‌ మహీంద్రకు మద్ధతుగా నెటిజన్లు పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు.