Viral Photo: భారతీయుల అల్పాహారాన్ని తక్కువ అంచనా వేయకండి.. వైరలవుతోన్న ఆనంద్ మహీంద్రా ఫన్నీ ట్వీట్..!
Anand Mahindra Funny Tweet: వ్యాపార దిగ్గజం మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా కెల్లోగ్ ఉప్మా గురించి సోషల్ మీడియాలో మీమ్‌ను పంచుకున్నారు. దీనిపై ప్రజలు ఫన్నీగా కామెంట్లు పంచుకుంటున్నారు.
Viral Photo: మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఎన్ని పనుల్లో బిజీగా ఉన్నా.. తన ఆలోచనలను ప్రజలతో పంచుకోవడానికి ఎల్లప్పుడూ సమయం తీసుకుంటాడు. ఆయన అనుచరులు కూడా కామెంట్లతో తెగ వైరల్ చేస్తుంటారు. తాజాగా ఆనంద్ మహేంద్ర కెల్లాగ్ ఉప్మా గురించి ఓ పాత కథనాన్ని పంచుకున్నాడు. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
అమెరికన్ కంపెనీ కెల్లోగ్ భారతదేశానికి వచ్చినప్పుడు భారతీయులందరి అల్పాహార అలవాట్లను వివిధ రకాల తృణధాన్యాల ద్వారా మార్చాలని సవాలు చేశారంట. అయితే, మారుతున్న కాలంతో భారతీయుల అల్పాహారం మారలేదు. కానీ, కెల్లాగ్స్ ఆహార ఉత్పత్తిని మార్చాల్సి వచ్చిందని మనందరికీ తెలిసిందే.
ఈ మీమ్‌ను తన ట్విట్టర్‌లో షేర్ చేస్తూ ఆనంద్ మహీంద్రా ఇలా అన్నాడు. ‘కెల్లోగ్స్ భారతదేశానికి వచ్చారు. భారతీయుల అల్పాహారం, అలవాట్లను పూర్తిగా మార్చుతామంటూ సవాలు చేశారు. కానీ, 10 సంవత్సరాల్లో కెల్లోగ్స్ మారిపోయింది” అంటూ రాసుకొచ్చాడు. దీంతో సోషల్ మీడియా వినియోగదారులు ఆనంద్ మహీంద్రా ట్వీట్‌ను తెగ వైరల్ చేస్తున్నారు.
ఈ ట్వీట్ 1200 కంటే ఎక్కువ రీట్వీట్‌లు, 12 వేలకు పైగా లైక్‌లను పొందింది. ‘భారతీయ ఆహారంలో విరామం లేదు’ అని ఒకరు కామెంట్ చేయగా, మరొక వినియోగదారు ‘పాశ్చాత్య అల్పాహారం భారతీయ పరాఠా, పోహా, జలేబి, మిర్చి వడ, వడా పావ్, మాతర్ కుల్చా, చుర్మా, చోలే-కుల్చే, లస్సీలను ఎన్నటికీ భర్తీ చేయదు’ అంటూ రాసుకొచ్చాడు.
Kellogg’s has been here for longer than a decade. So this is dated but the meme is going around now. And the sentiment endures. Never underestimate the power of our local ‘champions.’ pic.twitter.com/qnm64FyC4L
— anand mahindra (@anandmahindra) September 19, 2021
Our recipes have evolved over 1000s of years. A new recipe can’t just paradrop and take over like hollywood movie.
— Amt Kaka (@AmtKaka) September 19, 2021
Agreed, at least they made indians realize that breakfast can be healthy too
— 2shaR ⏺️ (@TWEETushar) September 19, 2021
?western breakfast here in India cannot replace parantha-plain&stuffed, poha, jalebi, mirchi vada, vada paav, matar kulcha, churma, chole-kulche, lassi, puri sabzi, chapati-sabzi-daal, curd rice, idli, upma, lemon rice, vada sambar, chapati-kebab, meethe chawal etc.
— SanchitaRS (@SanchitaRS) September 19, 2021
Also Read: