ఆహా.. ఇది కదా సంస్కారమంటే.. కట్టిపడేస్తున్న చిన్నారి వీడియో
తల్లిదండ్రులు, పెద్దలనుంచి పిల్లలకు సంస్కారం అలవడుతుంది. పెద్దలను గౌరవించడం, అవసరంలో ఉన్నవారికి సహాయపడటం.. తోటివారిపట్ల సహృదయంతో మెలగడం చిన్నప్పటినుంచి పిల్లలకు అలవాటు చేయాలి. అది ఆ కుటుంబానికే కాదు, సమాజానికి, దేశానికి కూడా ఎంతో మేలు జరుగుతుంది. సమసమాజ నిర్మాణం జరగుతుంది. తాజాగా ఓ నెట్టింట ఓ చిన్నారికి సంబంధించిన వీడియో నెటిజన్లను కట్టిపడేస్తోంది.
తల్లిదండ్రులు, పెద్దలనుంచి పిల్లలకు సంస్కారం అలవడుతుంది. పెద్దలను గౌరవించడం, అవసరంలో ఉన్నవారికి సహాయపడటం.. తోటివారిపట్ల సహృదయంతో మెలగడం చిన్నప్పటినుంచి పిల్లలకు అలవాటు చేయాలి. అది ఆ కుటుంబానికే కాదు, సమాజానికి, దేశానికి కూడా ఎంతో మేలు జరుగుతుంది. సమసమాజ నిర్మాణం జరగుతుంది. తాజాగా ఓ నెట్టింట ఓ చిన్నారికి సంబంధించిన వీడియో నెటిజన్లను కట్టిపడేస్తోంది. వీడియో చూసిన నెటిజన్లు పిల్లలకు ఇలాంటి మానవీయ విలువలు తప్పక నేర్పాలి అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియోలో ఓ చక్కాల కుర్చీలో ఓ దివ్యాంగుడు నాలుగు రోడ్ల కూడలిలో రోడ్డు దాటుతున్నాడు. అతనికి ఓ చిన్నారి సహాయం చేస్తోంది. అతని చక్రాల బండిని ముందుకు తోస్తూ రోడ్డు దాటిస్తోంది. ఈ క్రమంలో రోడ్డుకు ఇరువైపులా వస్తున్న వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. సేప్‌గా రోడ్డు దాటేందుకు సహకరించిన వాహనదారులకు ఆ చిన్నారి కృతజ్ఞతలు తెలిపిన తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ వీడియోను మన టెక్ దిగ్గజం ఆనంద్ మహీంద్రా తన ఎక్స్ ఖాతాలో షేర్ చేస్తూ.. ప్రపంచం అంతా ఇలా ఎందుకు ఉండలేకపోతోంది అంటూ క్యాప్షన్ జోడించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్రేయసితో కలిసి లాడ్జ్‌లో స్టే చేసిన యువకుడు.. బాత్‌రూమ్‌లో ??