Amul – Ponnian Selvan: పొన్నియిన్‌ సెల్వన్‌ క్రేజ్‌ను భలే వాడేసుకున్నారుగా.. అమూల్‌ కార్టూన్‌ వైరల్‌..

|

Oct 09, 2022 | 6:17 PM

ప్రముఖ పాల ఉత్పత్తుల సంస్థ అమూల్‌ తాజాగా పొన్నియిన్‌ సెల్వన్‌ క్రేజ్‌ను క్యాష్‌ చేసుకునే పనిలో పడింది. సమాజంలో జరిగే ట్రెండింగ్ అంశాలకు సంబంధించి..


మణిరత్నం దర్శకత్వంలో తాజాగా వచ్చిన చిత్రం ‘పొన్నియిన్‌ సెల్వన్‌-1’. అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమాను సెప్టెంబర్‌ 30న ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కల్కి కృష్ణమూర్తి రాసిన నవల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్‌ ముందు వండర్స్ క్రియేట్ చేస్తోంది.ఇదిలా ఉంటే ప్రస్తుతం పొన్నియిన్‌ సెల్వన్‌ చిత్రానికి సంబంధించిన పోస్ట్‌లు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ పాల ఉత్పత్తుల సంస్థ అమూల్‌ తాజాగా పొన్నియిన్‌ సెల్వన్‌ క్రేజ్‌ను క్యాష్‌ చేసుకునే పనిలో పడింది. సమాజంలో జరిగే ట్రెండింగ్ అంశాలకు సంబంధించి కార్టూన్‌లను రూపొందిస్తూ తమ సంస్థ ప్రొడక్ట్స్‌ను ప్రమోట్ చేసుకునే అమూల్‌.. పొన్నియిన్‌పై కూడా కార్టూన్‌ను రూపొంచింది. ఈ కార్టూన్‌లో విక్రమ్‌, ఐశ్వర్య, త్రిష, కార్తీలు అమూల్‌ బటర్‌తో బ్రెడ్‌ను తింటున్నట్లు డిజైన్‌ చేశారు. ఈ పిక్‌తో పాటు.. ‘పైసా వసూల్‌’ అని అర్థం వచ్చేలా క్యాప్షన్‌ రాసుకొచ్చారు. ఇక అమూల్‌ కార్టూన్‌ను నటి త్రిష కూడా తన్‌ ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో షేర్‌ చేయడం విశేషం.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Boys rent for girls: అమ్మాయిల కోసం అద్దెకు అబ్బాయిలు.! గంటకు ఇంత లెక్కన కిరాయికి బాయ్‌ ఫ్రెండ్‌..

Snake acting: అబ్బా ఎం యాక్టింగ్ గురు..! ఈ పాము స్టార్‌ హీరోలను మించిపోయిందిగా.. ఆస్కార్‌ ఇవ్వాల్సిందే

Published on: Oct 09, 2022 06:17 PM