Wife – Husband : వీడు అసలు మొగుడేనా.! దారుణం.. కూరలో ఉప్పు తక్కువైందని భార్యను పొడిచి చంపేశాడు.!
భోజన సమయంలో ఉప్పు తక్కువగా ఉందని భార్యపై భర్త ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో భార్యాభర్తల మధ్య మాటామాటా పెరిగింది. ఈ క్రమంలో ఆమెపై కత్తితో దాడి చేశాడు భర్త..
కూరలో ఉప్పు తక్కువేసిందని ఆగ్రహంతో కట్టుకున్న భార్యను పొడిచి హత్యచేశాడు ఓ భర్త. దారుణమైన ఈ ఘటన బీహార్‌లో సరన్ జిల్లాలో చోటుచేసుకుంది. మాంఝీ పోలీస్ స్టేషన్ పరిధిలోని కలాన్ గ్రామానికి చెందిన ప్రభురాం భార్య వంట చేసింది. అయితే, ఆరోగ్యం దృష్ట్యా కూరలో కాస్త ఉప్పు తగ్గించింది. భోజన సమయంలో ఉప్పు తక్కువగా ఉందని భార్యపై ప్రభురాం ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో భార్యాభర్తల మధ్య మాటామాటా పెరిగింది. ఈ క్రమంలో ఆమెపై కత్తితో దాడి చేశాడు ప్రభురాం. తీవ్రంగా గాయపడిన ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. ఈ ఘటనపై ప్రభురామ్ కుమారుడు వినోద్ రామ్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదుచేశారు. ప్రభురాంను అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Boys rent for girls: అమ్మాయిల కోసం అద్దెకు అబ్బాయిలు.! గంటకు ఇంత లెక్కన కిరాయికి బాయ్ ఫ్రెండ్..
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

