టికెట్లు క్యాన్సిల్‌ చేసినా అదనంగా 5 శాతం జీఎస్టీ పే చేయాల్సిందే !!

|

Sep 03, 2022 | 9:41 AM

కన్ఫామ్ అయిన రైలు, విమాన, హోటల్ టిక్కెట్లు రద్దు చేసుకుంటున్నారా? అయితే ఒక్క క్షణం ఆలోచించండి. ఆ టిక్కెట్లను వద్దనుకుంటే రద్దు చార్జీలు చెల్లించాలని తెలుసు. కానీ ఇప్పుడు రద్దు చార్జీలపైనా వస్తు సేవల పన్ను కట్టాల్సి ఉంటుంది.

కన్ఫామ్ అయిన రైలు, విమాన, హోటల్ టిక్కెట్లు రద్దు చేసుకుంటున్నారా? అయితే ఒక్క క్షణం ఆలోచించండి. ఆ టిక్కెట్లను వద్దనుకుంటే రద్దు చార్జీలు చెల్లించాలని తెలుసు. కానీ ఇప్పుడు రద్దు చార్జీలపైనా వస్తు సేవల పన్ను కట్టాల్సి ఉంటుంది. దాంతో, టిక్కెట్లను రద్దు చేయడం కూడా ఖరీదైన వ్యవహారం కానుంది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కొత్త రకం జీఎస్టీ విధింపుపై సర్క్యులర్ జారీ చేసింది. ఆగస్టు 3వ తేదీన ఆర్థిక మంత్రిత్వ శాఖ పన్ను పరిశోధన విభాగం జారీ చేసిన ఈ సర్క్యులర్ ప్రకారం టిక్కెట్ల బుకింగ్ అనేది ఒక ‘కాంట్రాక్టు’ అని అని తెలిపింది. దీని కింద సర్వీస్ ప్రొవైడర్ వినియోగదారుడికి సేవలను అందిస్తానని హామీ ఇస్తుందని తెలిపింది. కాబట్టి టిక్కెట్లు రద్దు చేసుకున్నా పన్ను చెల్లించాల్సిందే అని స్పష్టం చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం, ఫస్ట్ క్లాస్ లేదా ఏసీ కోచ్ టిక్కెట్‌ను రద్దు చేసేందుకు క్యాన్సెలేషన్ చార్జీపై అదనంగా 5 శాతం జీఎస్టీ విధిస్తారు. విమాన ప్రయాణం, హోటల్ టిక్కెట్లను క్యాన్సిల్ చేసినా ఐదు శాతం పన్ను కట్టాల్సి ఉంటుంది. టిక్కెట్లను బుక్ చేసుకునేటప్పుడు వర్తించే జీఎస్టీ రేటునే రద్దు చేసుకున్నప్పుడు కూడా వర్తింపచేస్తున్నారు. క్యాన్సెలేషన్ ఫీజు అనేది ఒప్పంద ఉల్లంఘనకు బదులుగా జరిగే చెల్లింపు కాబట్టి దానిపై జీఎస్టీ కట్టాల్సి ఉంటుందని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Pawan Kalyan: ఆ ఒక్క విషయంలో ఈయన ఎప్పటికీ తగ్గడు.. అందుకే అతను పవర్ స్టార్

Viral: వామ్మో !! రెండు మొసళ్ల మధ్య ఫైట్‌ ఎప్పుడైనా చూశారా ??

Nikhil: పవన్ కోసం తీసుకున్న ఒక్క నిర్ణయం.. ఈ హీరోను నిలబెడుతోంది

Pawan Kalyan: దిమ్మతిరిగేలా చేస్తున్న పవన్‌ మేనియా..

పేరుకు స్టార్ హీరోయిన్.. కాని అప్పనంగా 2 కోట్లు నొక్కేసింది !!

Published on: Sep 03, 2022 09:41 AM