చిన్నారి ప్రాణం తీసిన ఎయిర్ బ్యాగ్
ప్రాణాలు కాపాడాల్సిన ఎయిర్ బ్యాగ్ ఓ అభం శుభం తెలియని చిన్నారి ప్రాణం తీసింది. కారులో తండ్రి ఒడిలో కూర్చున్న బాలుడు ఊహించని విధంగా ప్రాణాలు కోల్పోయిన ఘటన తమిళనాడులోని ఆలత్తూర్‌లో జరిగింది. కారులో హఠాత్తుగా ఎయిర్ బెలూన్ తెరుచుకోవడంతో ఆరేళ్ల పిల్లాడు చనిపోయాడు. ప్రమాదాలు ఎప్పుడు, ఎలా సంభవిస్తాయో చెప్పలేం. అందుకే ప్రతి నిమిషం అప్రమత్తంగా ఉండాలంటారు పెద్దవారు.
ముఖ్యంగా వాహనాల్లో ప్రయాణించే సమయంలో పిల్లల విషయంలో ఇంకాస్త జాగ్రత్త అవసరం. బైకులు, కార్లలో పిల్లలను ఎక్కించుకుని ప్రమాదకరంగా ప్రయాణిస్తుండడం ఇటీవల కాలంలో పెరిగింది. వీరముత్తు అనే వ్యక్తి.. తన భార్య, కుమారుడు, మరో ఇద్దరితో కలిసి సోమవారం రాత్రి రెంటల్ కారులో కల్పకం నుంచి చెన్నైకి బయలు దేరారు. డ్రైవర్ విఘ్నేష్ కారు నడుపుతున్నాడు. వీరముత్తు తన ఆరేళ్ల కొడుకు కవిన్‌ను ఒళ్లో పెట్టుకుని ముందు సీట్లో కూర్చుకున్నాడు. ఆలత్తూర్ పెట్రోల్ బంక్ వద్ద వీరి కారు ముందెళుతున్న కారును ఢీకొట్టడంతో ఒక్కసారిగా కారులోని ఎయిర్‌బ్యాగ్ తెరుచుకుంది. అది ముందు సీట్లో తండ్రి ఒడిలో కూర్కొన్న చిన్నారి కవిన్ ముఖంపై వేగంగా తెరుచుకోవడంతో అతడు కుప్పకూలిపోయాడు. వెంటనే బాలుడిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, అప్పటికే బాలుడు చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. అప్పటి వరకు తమ ఒడిలో ముద్దుముద్దు మాటలు చెబుతూ ఆడుకున్న కుమారుడి ఆకస్మిక మరణంతో వీరముత్తు, అతడి భార్య షాకయ్యారు. ముందు వెళ్లిన కారు సిగ్నల్ ఇవ్వకుండా సడన్‌గా కుడివైపు తిరగడంతో ప్రమాదం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ముందు కారు డ్రైవర్ నిర్లక్ష్యంగా కారు నడిపి బాలుడి మరణానికి కారణమయ్యాడనే ఆరోపణలతో కేసు నమోదు చేశారు. షాక్, అంతర్గత రక్తస్రావం కారణంగా చిన్నారి మరణం సంభవించి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. పోస్ట్‌మార్టం రిపోర్ట్ రావలసి ఉంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
48 ఏళ్ల నాటి కేసులో 71 ఏళ్ల వ్యక్తి అరెస్ట్
పార్టీ చేసుకున్న యువతీయువకులు.. అర్ధరాత్రి షాకింగ్ సీన్.. చివరకు
రైలు టికెట్ లేని వారి నుంచి ఒక్క రోజే రూ.కోటి వసూలు
