ఇక్కడ మేఘాలను తాకచ్చు !! వర్షం అస్సలు కురవదు !!

|

Nov 03, 2022 | 9:24 AM

అస్సలు వర్షాలే కురవని ఒక గ్రామం భూమి మీద ఉందన్న విషయం తెలుసా.. అవునండీ యెమెన్‌ దేశంలో ఉన్న ఒక గ్రామంలో సంవత్సరం మొత్తంలో ఒక్కసారి కూడా వర్షం పడదు.

అస్సలు వర్షాలే కురవని ఒక గ్రామం భూమి మీద ఉందన్న విషయం తెలుసా.. అవునండీ యెమెన్‌ దేశంలో ఉన్న ఒక గ్రామంలో సంవత్సరం మొత్తంలో ఒక్కసారి కూడా వర్షం పడదు. యెమెన్‌ రాజధాని సనాకు పశ్చిమ దిశలో అల్‌ హుతైబ్‌ ( Al -hutaib ) అనే గ్రామం ఉంది. ఇది భూ ఉపరితలానికి 3200 కిలోమీటర్ల ఎత్తులో ఉంటుంది. ఇది మేఘాలు ఉండే ప్రాంతానికంటే కూడా ఎత్తు అన్నమాట. అంటే.. ఈ గ్రామంలో మేఘాలు మన కాళ్ల కింద ఉంటాయి. వీటిని ఈజీగా చేతులతో తాకొచ్చు. మేఘాల కన్నా ఎత్తులో ఈ గ్రామం ఉంది కాబట్టే ఇక్కడ ఎప్పుడూ వర్షం కురవదు. మేఘాల కంటే ఎత్తులో ఉండటంతో ఈ వింతైన గ్రామం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. మేఘాలపై నిలబడి వర్షం భూమి మీద పడే సుందర దృశ్యాన్ని చూసేందుకు అల్‌ హుతైబ్‌ గ్రామానికి ఏటా వేలాది మంది టూరిస్టులు వస్తుంటారు. కొండపై నుంచి కిందకు వెళ్తూ వర్షా్న్ని తాకుతూ ఎంజాయ్‌ చేస్తుంటారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కోహ్లి చెప్పిన ఆ ఒక్కమాటతో రెచ్చిపోయిన రాహుల్..

అతను ఒక్కరోజు తినే ఫుడ్‌తో చిన్నపాటి ఫంక్షన్‌ చేయొచ్చట..

Published on: Nov 03, 2022 09:24 AM