Flight Attendant: గుక్కపెట్టి ఏడ్చిన చిన్నారి.. విమాన సిబ్బంది చేసిన పనికి అంతా అవాక్కు..!(video)

|

Sep 05, 2022 | 8:19 AM

చిన్న పిల్లలతో విమానంలో ప్రయాణించడం నిజంగా కష్టమైన పని. అలాంటప్పుడు విమాన సిబ్బంది సహకరిస్తే ప్రయాణం సుఖంగా ఉంటుంది. నీల్ మాల్కం అనే ఎయిరిండియా సిబ్బంది


చిన్న పిల్లలతో విమానంలో ప్రయాణించడం నిజంగా కష్టమైన పని. అలాంటప్పుడు విమాన సిబ్బంది సహకరిస్తే ప్రయాణం సుఖంగా ఉంటుంది. నీల్ మాల్కం అనే ఎయిరిండియా సిబ్బంది ఓ ప్రయాణికుడి కూతురిని తన భుజంపై ఎత్తుకుని ఓదార్చారు. అందుకు ఆ చిన్నారి తండ్రి నీల్ మాల్కంకు కృతజ్ఞతలు తెలిపారు.ఆగస్ట్ 7న ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ వీడియోలో ఎయిర్ ఇండియా క్యాబిన్ సిబ్బంది నీల్, ప్రయాణికుడి కూతుర్ని ఓదార్చారు. అతని ఆత్మీయ ప్రవర్తనను మెచ్చుకున్న చిన్నారి తండ్రి.. ‘నా కూతురు అతని భుజం మీద హాయిగా నిద్రపోవడం చూసి ఆశ్చర్యపోయాను. ఎయిరిండియాను టాటా స్వాధీనం చేసుకున్న తర్వాత చాలా మార్పులు జరుగుతున్నాయి’ అని పోస్ట్‌లో రాసి నీల్ మాల్కమ్‌ను ట్యాగ్ చేశాడు. హృదయాల్ని హత్తుకునే ఈ వీడియో 1,70,000 పైగా లైక్‌లు, 2 మిలియన్లకు పైగా వ్యూస్ సంపాదించింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Bride Running on Road: నీ తల్లీ అంటూ మరోసారి తెలంగాణ శకుంతలను గుర్తు చేసిన మహిళా.. నన్ను పెళ్లి చేసుకుంటావా..లేదా..!

Mother sentiment: పసితనంలో తల్లిని పోగొట్టుకొని.. ఆమె తల్లి సమాధి వద్ద ఈ పిల్లాడు చేసిన పనికి మీకు కూడా కనీళ్లు ఆగవు..

Published on: Sep 05, 2022 08:19 AM