కంపెనీ వెబ్‌సైట్‌లో ఆత్మ హత్య లేఖ.. తన చావుకు భార్యే కారణం

|

Mar 13, 2025 | 3:40 PM

భార్య వేధింపులు భరించలేక బెంగళూరు టెకీ అతుల్‌ సుభాష్‌ ఆత్మహత్య చేసుకున్న తరహాలో మరో వ్యక్తి ప్రాణాలు తీసుకున్నాడు. కంపెనీ వెబ్‌సైట్‌లో సూసైడ్‌ నోట్‌ను పోస్టు చేసి, ముంబయిలో ఒక హోటల్‌ గదిలో బలవంతంగా ప్రాణాలు తీసుకున్నాడు. పోలీసుల వివరాల ప్రకారం.. నిశాంత్‌ త్రిపాఠి ఇటీవల ముంబయిలోని ఒక హోటల్‌లో దిగాడు.

చనిపోవడానికి ముందు తన గదికి ‘డు నాట్ డిస్టర్బ్’ అనే బోర్డు తగిలించాడు. దాంతో సిబ్బంది అటు వైపుగా వెళ్లలేదు. కానీ ఎంతకీ అతడు గది నుంచి బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన సిబ్బంది తమవద్ద ఉన్న తాళం చెవితో గది తలుపులు తెరిచారు. అలాగే పోలీసులకు సమాచారం అందించారు. కానీ అప్పటికే నిశాంత్ మరణించాడు. చనిపోవడానికి ముందు తన కంపెనీ వెబ్‌సైట్‌లో సూసైడ్ నోట్‌ను షేర్ చేశాడు. అందులో తన భార్య పట్ల తనకున్న ప్రేమను వ్యక్తంచేశాడు. భార్యతో పాటు ఆమె బంధువు తన చావుకు కారణమని తెలిపాడు. నువ్వు ఈ లేఖ చదివే సమయానికి నేనుండను అని భార్యను సంబోధిస్తూ రాసాడు. తమ ఇద్దరి మధ్య జరిగిన వాటికి తను ఆమెను ద్వేషించాలి కానీ తను ప్రేమనే ఎంచుకుంటాననీ ఆ ఇద్దరి వల్ల తను పడిన వేదనంతా తన తల్లికి తెలుసుననీ రాసుకొచ్చాడు. తన తల్లిని కలవొద్దనీ ఆ లేఖలో వాపోయారు. నిశాంత్ తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వారిపై కేసు నమోదు చేశారు. నిశాంత్ తల్లి ఒక మహిళా హక్కుల కార్యకర్త. తన కుమారుడి మరణంపై తీవ్ర ఆవేదనకు గురైన ఆమె.. సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. ఇంక తనకు జీవితమే లేదనీ ఇప్పుడు తానొక జీవచ్ఛవాన్ననీ తన బిడ్డ తనను వదిలిపెట్టి వెళ్లిపోయాడని ఆమె రాసుకొచ్చారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

SSMB29 సినిమా షూటింగ్ పై ఒడిశా డిప్యూటీ సీఎం ట్వీట్

Vijay Thalapathy: ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యిందే! దెబ్బకు మైండ్ బ్లాక్ కదూ

శంకర్‌కు బిగ్ రిలీఫ్! ఆయన 11 కోట్ల ఆస్తుల జప్తుకు బ్రేక్

TOP 9 ET News: హనుమంతుడి గాథే… SSMB 29 ?? | రామ్‌ చరణ్‌తో బాలీవుడ్ ప్రొడ్యూసర్..ధమాకా దార్ ప్లాన్

పెళ్లి రిసెప్షన్.. నమ్రత, చరణ్,ఉపాసన హంగామా